రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని, రాష్ట్రంలో శాం-తి-భ-ద్ర-త-ల-కు ఎలాంటి ముప్పు లేదు అని రాష్ట్ర డీజీపీ గౌతం సవంగ్ స్పష్టం చేసారు. ఎన్నికలు జరుగుతున్న వేళ అన్ని చోట్లా, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసామని అన్నారు. ఎవరైనా గొ-డ-వ-లు చేస్తే వారి పై, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము పోలీసులం అని, తమకు పార్టీలతో సంబంధం ఉండదని, ఎవరు ఫిర్యాదు ఇచ్చినా, దాని పై స్పందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా, మా-చ-ర్ల-లో జరిగిన ఘటన తరువాత, బుద్దా వెంకన్న, బొండా ఉమా పై హ-త్యా ప్రయత్నం చేసిన తురక కిషోర్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటూ, తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు పై, అలాగే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై కూడా డీజేపీ స్పందించారు. మా-చ-ర్ల దాడి ఘటన నిందితులను అరెస్టు చేసి గురజాల స-బ్-జై-లు-కు పంపామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మా-చ-ర్ల దా-డి ఘటన నిందితులపై సెక్షన్ 3-0-7 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని వారిని గురజాల స-బ్-జై-లు-కు పంపామన్నారు.
దా-డి ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగించటంతో పాటు పోలీసులకు చెప్పి వెళ్లామంటున్న తెలుగుదేశం నేతల వ్యాఖ్యలపైనా విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరించటంతో పాటు వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తూ... వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు. ఘటనల వివరాలు, దర్యాప్తు సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఈసీకి ఇస్తున్నామని వెల్లడించారు. అయితే డీజీపీ చెప్పే మాటలకు, రాష్ట్రంలో జరుగుతున్న పనులకు పొంతన లేదని, 5 కోట్ల ప్రజలే, రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చూస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది.
ఇక పొతే, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉ-ద్రి-క్త-త-ల-కు దారితీసింది. అధికార పక్షం తప్ప ఇతరులెవ్వరూ బరిలో ఉండకూడదన్న రీతిలో అధికార పార్టీ కార్యకర్తలు పెట్రేగిపోయారు. యాభై వార్డుల్లో దాదాపు పదహారు వార్డులకు అధికార పక్షం తప్ప మరే ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం....మూడు దా-డు-లు....ఆరు పత్రాల చించివేతగా సాగింది. తిరుపతిలో పులివెందుల సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగుణమ్మ మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా సభ్యులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆమె....నగరంలోని 9,10,11,12 వార్డుల్లో తెదేపా నేతలను బయటకు నెట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.