రాష్ట్రంలో శాం-తి-భ-ద్ర-త-లు పూర్తిగా క్షీణించాయని, వాటిని రక్షించాల్సిన పోలీస్ శాఖ వ్యవహారశైలి ప్రశ్నార్థకంగా మారిందని, ఖాకీల చర్యలను ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయని, చట్టం-నేరం కొన్నిచోట్ల చెట్టపట్టాలేసుకొని ప్రయాణం చేస్తున్న ప్రమాదకర పరిస్థితి జగన్ ప్రభుత్వంలోనే సాగుతోందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మా-చ-ర్ల సంఘటన చూశాక, సాక్షాత్తూ ప్రజాప్రతినిధులపైనే ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం దా-డి జరిగాక పోలీస్ శాఖ ఏం చేసిందని ఆయన నిలదీశారు. టీడీపీనేతలు, న్యాయవాది కిశోర్ ప్రయాణిస్తున్న వాహనాలను వెం-టా-డి.. వెం-టా-డి వారిని ఇ-ను-ప-రా-డ్ల-తో దా-డి చేసిన తురకా కిశోర్, ఇతర వైసీపీ గూం-డా-ల పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఎవరైనా చట్టం నేరం కలిసిపోయాయనే భావిస్తారన్నారు. మా-చ-ర్ల-లో జరిగిన దా-డి ఘటనను దర్యాప్తు చేయడంలో పోలీస్ శాఖ తత్తరపడి, తడబాటుకు గురైందన్నారు. టీడీపీనేతలు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోయినట్లయితే, వారు ఇప్పటికే హ-త-మై ఉండేవారన్నారు. ఇంతఘోరంగా దాడి జరిగితే, పోలీసులు తురకా కిశోర్ పై హ-త్యా-య-త్నం కేసు పెట్టకుండా అతనికి మేలు చేశారని వర్ల మండిపడ్డారు. జరిగిన ఘటనకు సంబంధించి ముగ్గురిని హ-త్యా-య-త్నం కింద అరెస్ట్ చేశామని లా అండ్ ఆర్డర్ ఐజీ జే.ప్రభాకర్ రావు చెప్పాక, స్థానిక పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారని రామయ్య ప్రశ్నించారు. మా-చ-ర్ల-లో చట్టం-నేరం కలిసి నడిచాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వర్ల నిలదీశారు.
చట్టం – నేరంతో కలిసి పనిచేశాయి కాబట్టే, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చివదిలేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇంతజరిగాక ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, మా-చ-ర్ల-లో టీడీపీవారిపై దా-డి-కి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కోర్టుకి పంపారని చెప్పారని, స్థానిక పోలీసులు ఒకలా చేస్తే, ఎన్నికల కమిషనర్ మరోలా చెబుతున్నాడని ఇందులో ఏది నిజమని రామయ్య ప్రశ్నించారు. చట్టం ఎందుకింతలా తప్పటడుగులు వేస్తోందని, ఎవరిమెప్పుకోసం, ఎవరిని సంతోషపెట్టడం కోసం పోలీసులు నేరంతో కలిసి ప్రయాణిస్తున్నారో గుంటూరు రూరల్ ఎస్పీ, జిల్లా ఐజీ సమాధానం చెప్పాలని టీడీపీనేత విలేకరులసాక్షిగా డిమాండ్ చేశారు. మా-చ-ర్ల డీఎస్పీపై, సీఐపై, ఎస్సైపై ఏంచర్యలు తీసుకుంటారో, ముద్దాయిలను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలన్నారు. మా-చ-ర్ల-లో జరిగిన ఘటనతో రాష్ట్రం మొత్తం వణికిపోయిందని, అదిచూశాక కూడా పోలీసులు శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పటం దారుణమన్నారు. తెనాలిలో జరిగిన ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని, లిక్కర్ సీసాలు తీసుకెళ్లి, టీడీపీ అభ్యర్థి ఇంట్లోకి దొంగలాగా వెళ్లి, అక్కడ పెట్టిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారన్నారు. మందు సీసాలు ఇంట్లో పెట్టిన అతన్ని వదిలేసి, నామినేషన్ వేయనీయకుండా సదరు అభ్యర్థిపై దొంగకేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారన్నారు.
ప్రజలను కాపాడాల్సిన చట్టమే, నే-ర-స్తు-ల-తో కలిసి ప్రయాణిస్తుంటే, ఇకప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన వారేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వర్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ భర్త, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించారని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని హుకుం జారీ చేశాడని, అందుకు సంబంధించిన సాక్ష్యం తమవద్ద ఉందని, దానిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో, ఎమ్మెల్యే భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. గుంటూరులో ఇలాంటి ఘటనలు జరిగాక కూడా ఆజిల్లా రూరల్ ఎస్పీ జయరావు, రాష్ట్రంలో, ముఖ్యంగా ఆ జిల్లాలో శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పగలరా అని టీడీపీనేత నిగ్గదీశారు. రాష్ట్రం కంటే బీహార్ నయమని, బీహార్లో పరిస్థితులు మనరాష్ట్రంలో కంటే సజావుగా ఉన్నాయనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్నిస్థానాలు ఏకగ్రీవం చేసి, జగనన్నకు కానుకగా ఇస్తామని ఒక పోలీస్ చెబుతున్నాడని, అలాంటి పోలీసులు రాష్ట్రానికి అవసరమా అని రామయ్య ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పలేని దయనీయమైన స్థితిలో ఏపీ పోలీస్ శాఖ ఉందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడికి 151 కింద నోటీసులు ఇవ్వడంద్వారా పోలీసులు హస్యపూరితంగా ప్రవర్తించారని, సుదీర్ఘ రాజకీయఅనుభవమున్నవ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించలేని దౌర్బాగ్య పరిస్థితిలో పోలీస్ శాఖ ఉందని విశాఖ ఘటనతో తేలిపోయింద న్నారు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన పోలీస్ గా పేరుతెచ్చుకున్న ఏపీ పోలీసులను నీరుగార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, రాష్ట్ర డీజీపీ 5.45ని.షాలు కోర్టులో నిలబడేట్లుగా చేసిన ఘనతకూడా జగన్ కే దక్కుతుందన్నారు. డీజీపీ అంతలా దిగజారి కోర్టులకు సంజాయిషీ ఇచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కారణం కాదా అని వర్ల నిలదీశారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకొని, ఆయనపై దా-డి-కి యత్నించినవారిని వదిలేసి, ఆయన్ని అరెస్ట్ ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలని చూడటం ఎంతవరకు న్యాయమన్నారు. విశాఖ ఘటనచూసి విశ్రాంత పోలీస్ అధికారులంతా ముక్కున్న వేలేసుకున్నారన్నారు.