నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీని, హైకోర్ట్ పిలిపించిన సంగాతి తెలిసిందే. ఈ సందర్భంగా, చంద్రబాబు ని వైజాగ్ లో అరెస్ట్ చెయ్యటం, 151 నోటీస్ ఇవ్వటం పై, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సందర్భంలో, అమరావతిలో, పోలీసులు చేసిన దాని పై కూడా, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా.. రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై.. గతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై త్రిసభ్య ధర్మాసనం.... డీజీపీ సవాంగ్​ని వివరణ కోరింది. మందడం వీధుల్లో 500 మంది పోలీసులు కవాతు చేస్తున్న పెన్‌డ్రైవ్‌లోని వీడియోను చూశారా అని అడిగింది. అంతమంది పోలీసులు ఒక గ్రామంలో ఎందుకు తిరగాల్సి వచ్చిందని నిలదీసింది. ఆ వీడియోలో పోలీసుల హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న ధర్మాసనం.... శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే హెచ్చరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. వీడియోను చూశానని డీజీపీ హైకోర్ట్ కు సమాధానం చెప్పారు.

pendrive 13032020 2

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా.. జనవరి 10న పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారని బదులిచ్చారు. చట్ట నిబంధనల మేరకు అనుగుణంగా వ్యవహరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రూల్‌ ఆఫ్‌లాను తప్పక పాటించాల్సేందేనని తేల్చిచెప్పింది. ఇందుకోసం పోలీసు విభాగాల అధిపతిగా డీజీపీ చర్యలు తీసుకుంటారని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. స్పందించిన గౌతం సవాంగ్‌.... అది తన కర్తవ్యమని తెలిపారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సక్రమంగా అమలయ్యేలా చూస్తానని.. మౌఖికంగా కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

pendrive 13032020 3

నెల రోజుల్లో రెండుసార్లు హాజరు... హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలో డీజీపీ రెండు సార్లు న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో ఇద్దరు యువకుల మిస్సింగ్ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు జ్యుడీషియల్ విచారణకు సరైన సమాచారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల జరిపిన విచారణలో డీజీపీ స్వయంగాతమఎదుటహాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం విశాఖలో చంద్రబాబుకు సీఆర్పీసీ 151 సెక్షన్ నోటీసులు జారీ చేయడంపైనా డీజీపీని హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర డీజీపీ రెండుసార్లు న్యాయస్థానానికి హాజరై వివరణ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read