రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖాకీలు ఇలాగే పనిచేస్తే తిరుగుబాటు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అభ్యర్థుల ఇళ్లల్లో మద్యం ఉన్నట్లు చిత్రీకరించి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పోలీసు టెర్రరిజం కొనసాగుతోందన్న చంద్రబాబు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వారు పనిచేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా, దా-డు-లు జరుగుతున్న నేపధ్యంలో, బీఫారంలు ఇవ్వటానికి, న్యాయవాదులను వాడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాదులు డైరెక్ట్ గా వెళ్లి, అధికారులకు బీఫారంలు ఇస్తారు. న్యాయవాదుల పై అంత తొందరగా దా-డి చెయ్యలేరని, చేస్తే ఇక ఏమి చేస్తాం అని చంద్రబాబు అన్నారు. " మేము ఒకటే అడుగుతున్నాం. అన్నిచోట్ల సీసీకెమెరాలు పెట్టి, ఎన్నికలు నిర్వహించాలి.   బీఫామ్స్ అన్నీ మా అడ్వకేట్స్ ద్వారా పంపిస్తాం. వీళ్లు మధ్యలో లాక్కునే ప్రమాదం కూడా ఉంది. అప్పటికీ ఏం చేస్తారో చూస్తాం." అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ "రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు. “రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలను ఇస్తుంది” అని ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. అదే ఈ రాష్ర్టంలో జరుగుతోంది. ‘‘రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’’ ఇది. "

"ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకోసం చేస్తున్న ఉద్యమం ఇది. ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కావని, అంతవరకే పరిమితం కాదని ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వానికి గానీ చెక్ పెట్టకపోతే, ఇప్పటికే చాలా డామేజ్ చేశారు.. ఇంకా చేస్తారు. చివరకు అడిగే నాథుడే ఉండడు. ఉ-గ్ర-వా-దు-ల కంటే దారుణంగా తయారయ్యారు. పోలీస్ టెర్రరిజం..ఖాకీ టెర్రరిజం పెరిగిపోయింది. వీళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరింత పేట్రేగిపోతారు. వీళ్లనిలాగే వదిలేస్తే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు, మానానికి రక్షణ ఉండదు. అందుకే ప్రజలకు పిలుపునిస్తున్నా. ధైర్యంగా ముందుకుపోదాం..పోరాటంతో ముందుకెళ్లి వీళ్లని నిలువరిద్దాం. అవకాశవాదులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. డబ్బుసంచులకు అమ్ముడుపోయారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు కొందరు ఉంటే, రాజ్యాంగం పరిరక్షణ కోసం కొందరు పోరాడుతున్నారు. దారికి రానివారిపై పాతకేసులు తిరగదోడుతూ, ఆర్థికమూలాలు దెబ్బతీస్తూ నానారకాలుగా హిం-సి-స్తు-న్నా-రు. అందుకే నేను ఒకటే కోరుతున్నా..ప్రజలు ధైర్యంగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి, పిరికితనంతో పోవద్దు, ఇది ఒక్క తెలుగుదేశంపార్టీ బాధ్యతే కాదు. ఈనాడు ఎవరైతే పోటీచేస్తున్నారో, వారంతాకూడా రాజ్యాంగ పరిరక్షణకోసం పోరాడుతున్నారు.

"ఆ విషయం మీరంతా గుర్తుంచుకోండి. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారంతా, శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ ఉద్యమాన్ని అ-ణి-చే-సే-వా-ళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. తాత్కాలికంగా భాధలు ఉంటాయి. అందరం కలిసి సమష్టిగా పోరాడుదాం. ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో సంక్షేమాన్ని ఏవిధంగా దెబ్బతీశారో ప్రజలకు తెలియచేయడానికి ఒక పత్రాన్ని విడుదలచేస్తున్నాం. వైసిపి ప్రభుత్వ 10నెలల పాలనలో సంక్షేమం ఏవిధంగా కుంటుపడిందో తెలియచేసే నిజపత్రం విడుదల చేస్తున్నాం. వైసీపీ వచ్చాక 35పథకాలను రద్దు చేశారు. రద్దుల పద్దులు- రివర్స్ పాలన తప్ప సాధించిందేమీ లేదు. నేరుగా ఒక్కటే అడుగుతున్నా... పోలీసులు పోలీసుల్లాగా ప్రవర్తిస్తున్నారా..? కోర్టులో డిజిపితో సెక్షన్ 151 చదివించిన సందర్భం ఉందా..?తాను కోర్టులో వేసిన అఫిడవిట్ తప్పిన ఒప్పుకున్న డీజీపీ రాష్ట్రంలో తప్ప, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? తప్పు అయ్యిందని కోర్టులో ఒప్పుకోలేదా డిజీపీ..? సామాన్య ప్రజానీకం పోలీసుల వద్దకు వచ్చేపరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? డీజీపీకి విశ్వసనీయత ఉందా? అందుకే పోలీస్ టెర్రిరిజం అంటున్నా. ఈ రాష్ట్రం సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారు. దీన్ని పరిరక్షించడానికి మేం ఉద్యమిస్తున్నాం. మీ సబార్డినేట్స్ ను కట్టడి చేయండి. హద్దుమీరిన వాళ్లను నియంత్రించండి. ప్రజలకు రక్షణగా నిలవండి, ఒకవ్యక్తికి ఊడిగం చేయడం కాదు.. కోర్టులో కూడా అదేచెప్పారు. శాశ్వతంగా లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయాలి. కథలు చెప్పడం మాని, ఇప్పటికైనా పనిచేయండి. అడిగేవాళ్లు లేరని తమాషాలు ఆడతారా? పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే, ఆనాడు సిపాయిల తిరుగుబాటు ఎలా వచ్చిందో, అలాంటి పరిస్థితే వస్తుంది." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read