మా-చ-ర్ల కు వెళ్లిన తనని, బుద్దా వెంకన్నని నడిరోడ్డుపై హ-త్యచేయడానికి ప్రయత్నించారని, తామేమీ అక్కడ ఎన్నికల ప్రచారానికో, పార్టీ కార్యక్రమాలకో వెళ్లలేదని, టీడీపీకి చెందిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడంతో, వారికి న్యాయం జరిగేలా చూడటంకోసం, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేయడానికి, న్యాయవాదిని తీసుకొని అక్కడకు వెళ్లడం జరిగిందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మా-చ-ర్ల-లో దాడి ఘటన నుంచి బయటపడి, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బొండాఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు, తమపై జరిగిన హ-త్యా-య-త్నా-న్ని, వైసీపీ గూం-డా-లు, మా-ర-ణా-యు-ధా-ల-తో తమవెంటపడిన వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి వివరించారు. అనంతరం వారిరువురూ పార్టీ అధినేతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడానికి, తమ జడ్పీటీసీలకు నామినేషన్లు వేసేంతవరకు భద్రత కల్పించాలని కోరడానికి మా-చ-ర్ల వెళ్లామేగానీ, అక్కడేదో రిగ్గింగులు చేయడానికి వెళ్లలేదన్నారు. మా-చ-ర్ల-లో ఏంజరిగిందో ప్రజలంతా తెలుసుకోవాలన్న ఉమా, ఒకకారులో తాను, వెంకన్న, మరోకారులో మా పీ.ఏ.లు, గన్ మెన్లు, మరో కారులో న్యాయవాది 3కార్లలో మాచర్ల వెళ్లామని, తాము వస్తున్న విషయాన్ని ముందురోజు రాత్రే మాచర్ల పోలీసులకు తెలియచేశామన్నారు. మేము వస్తున్న సమాచారాన్ని అక్కడి పోలీసులే వైసిపి వాళ్లకు తెలియజేశారని, ఆ సమాచారంతోనే మా-చ-ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమపై దా-డి చేయించేందుకు స్కెచ్ వేశారని అన్నారు.
తాము మా-చ-ర్ల-కు వెళుతున్నప్పుడే కారంపూడి నుంచి తమను అనుసరించారని, ఎప్పుడు ఏఊరు దాటుతున్నామో తెలుసుకుంటూ, మా-చ-ర్ల పట్టణం వరకు వెన్నాడారని అన్నారు. తమ వాహనానికి ముందే, న్యాయవాది కిషోర్ వాహనం మా-చ-ర్ల పట్టణంలోకి ప్రవేశించగానే దానిపై రా-ళ్లు, క-ర్ర-ల-తో దా-డిచేశారన్నారు. దా-డిలో న్యాయవాది త-ల-ప-గి-లి తీవ్ర గా-యా-ల-య్యా-య-ని, ఆకారులో తాము లేమని తెలుసుకుని, దాని వెనకాలే ఉన్న తమ వాహనంపైకి, ఒకేసారి 30మంది మా-ర-ణా-యు-ధా-ల-తో దా-డికి తెగబడ్డారన్నారు. వారినుంచి తమ డ్రైవరు ఏసు తమను కాపాడాడని, ఏసుక్రీస్తులా తమను రక్షించాడని, చాకచక్యంగా వాహనం నడిపి, వైసీపీ గూం-డా-ల-కు దొరక్కుండా తీసుకెళ్లాడని అన్నారు. ఆ తరువాత మరోచోట రెండవ స్కెచ్ వేశారు, మరో చౌరస్తా వద్ద తమను అడ్డుకుని, మళ్లీ దా-డిచేశారని, వెంకన్న గన్ మెన్ తనచేతిలోని తు-పా-కీ-ని చూపించినా లెక్కచేయకుండా దా-డి-కి పాల్పడ్డారని అన్నారు.
మాచర్ల పట్టణం దాటి వెల్దుర్తి వైపు వెళ్తుంటే, దారి పొడవునా తమను వెన్నాడారని బొండా తెలిపారు. వెల్దుర్తి గ్రామానికి దగ్గరలో తమను పోలీసులు ఆపారని, డీఎస్పీ జయరామ్, మరో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు మా వాహనాల్లోంచి వారి వాహనాల్లోకి ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్లారన్నారు. వెల్దుర్తి గ్రామం దాటగానే మూడోచోట మరో స్కెచ్ వేశారని, రోడ్డుకి అడ్డంగా 200మంది గొ-డ్డ-ళ్లు, క-త్తు-లు, పా-ర-లు, ప-లు-గు-లు పట్టుకొని సామూహిక దా-డి చేశారు. తామున్న వాహనంతోపాటు, డీఎస్పీ జయరామ్ ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు కూడా పగలగొట్టారని బొండా చెప్పారు. దా-డిని ఆపడం కోసం డీఎస్పీ తనదగ్గరున్న గ-న్ తీసి వారిని హెచ్చరించి, నిలువరించి తమను ఆయన వాహనంలో ఎక్కించి మరోవైపు నుంచి పంపారని అన్నారు. కేవలం రెండే రెండు నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోకుండా బయటపడ్డామని, లేకుంటే మా శ-వా-లే పార్టీ కార్యాలయానికి వచ్చి ఉండేవన్నారు. గురజాల డీఎస్పీ జయరామ్ రాకుంటే తమ శ-వా-లే మిగిలేవని అన్నారు.
మమ్మల్ని కాపాడిన డీఎస్పీ జయరామ్ గురజాలవాడని, తమను వెంబడిస్తున్నారని తెలిసే, ఆయన మావద్దకు వచ్చాడని, ఆయన రాకపోతే జరగాల్సిన ఘోరం జరిగి ఉండేదన్నారు. ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళుతుంటే, చుట్టుముట్టిన వైసీపీరౌ-డీ-లు వారిని తమకు వదలకుంటే, డీస్పీని కూడా వదలేది లేదని ఆయన్ని కూడా ప్రతిఘటించడం జరిగిందన్నారు. ఆదుర్మార్గుల నుంచి మమ్మల్ని కాపాడి, డొంకదారిలోనుంచి, పొలాలమధ్యనుంచి తమ వాహనాన్ని పక్క నియోజకవర్గంలోకి పంపించాడన్నారు. ఆ నియోజకవర్గం దాటేవరకు ఆయన తమవెంటే ఉండి, తరువాత తన పరిధికానందున తాను రాలేనని చెప్పడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని హ-త్య చేయించడానికి ప్రయత్నించడం చూస్తుంటే, జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల ప్రా-ణా-ల-కు హామీ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను హ-త్య చేయడానికి ప్రయత్నించడమే కాకుండా, జరిగిన ఘటనను కప్పిపుచ్చడానికి మా-చ-ర్ల ఎమ్మెల్యే ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.