బ్రిటీష్ హయాంలో నాటి ప్రధానిగా ఉన్న సర్ విన్ స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో మాట్లాడు తూ, “భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు, ఒక వేళ ఇస్తే, అధికారం, జులాయిలు, పోకిరీలు, ఇతరుల పై ఆధారపడి బతికేవాళ్లకు దక్కుతుంది” అనిచెప్పడమేగాక, “తక్కువ సమర్థత కలిగిన గడ్డిపోచల్లాంటి వాళ్లు, అధికారం దక్కించుకోవడం కోసం తియ్యటిమాటలు చెబుతూ, వెర్రి హృదయాలతో ప్రవర్తిస్తారని, అలాంటివారివల్ల దేశం ముక్కలుముక్కలుగా విడిపోతుంది” అని చెప్పడం జరిగిందని, ఆయన మాటలు చదివాక, చర్చిల్ కి ఎంత జా-త్యా-హాం-కా-ర-మ-ని తాను ఆవేశపడ్డానని టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మరో ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి మంగళగిరిలోనిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేడున్న పరిస్థితులు, నాయకుల పాలన చూస్తుంటే వందేళ్ల క్రితం విన్ స్టన్ చర్చిల్ చెప్పింది నిజమేననే అభిప్రాయం తనకు కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అ-త్యా-చా-రం చేస్తున్నారని, ఇటువంటి దా-రు-ణ పరిస్థితుల్లో ప్రజలంతా మేల్కొని, కలిసికట్టుగా పోరాడాలని దీపక్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న దా-రు-ణా-ల-కు సంబంధించి, ఎన్నికల సంఘానికి లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు చేశామని, అయినా కూడా ఈసీ నుంచి స్పందనలేదన్నారు. నామినేషన్ల వ్యవహారంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలను తాను ప్రజలముందుంచుతున్నానని ఎమ్మెల్సీ చెప్పారు.

10వ తేదీన, రేపల్లెలో 11న శ్రీకాళహస్తిలో, మరోచోట టీడీపీఅభ్యర్థుల ఇళ్లల్లో మందుసీసా లుపెట్టి, వారిపై తప్పుడు కేసలు పెట్టడం జరిగిందన్నారు. నిన్నటికి నిన్న తెనాలిలోకూడా టీడీపీ అభ్యర్థి ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద మద్యంసీసాల కేసుని పెట్టడం జరిగిందన్నారు. వారింట్లో ఉన్నసీసీకెమెరాలో ఈదృశ్యాలన్నీ నమోదయ్యాయని, ముఖాని కి బట్ట కట్టుకొని, గోడదూకి మరీ ఆఇంటిలోకి వెళ్లి, వైసీపీకి చెందిన వ్యక్తి ఆ పనికి పాల్పడ్డాడని దీపక్ రెడ్డి తెలిపారు. వైసీపీవారే మందుసీసాలు పెట్టి, పోలీసులకు ఫిర్యాదుచేశారని, దాంతోపోలీసులు నేరుగా వచ్చి, ఇంట్లో మందుసీసాలున్న ప్రాంతానికే వెళ్లారన్నారు. పుంగనూరులో ఎస్టీమహిళను నామినేషన్ వేయకుండా దా-డి చేశారని, ఆమె బురఖా ధరించి వెళ్లినాకూడా అడ్డుకొని, సదరుమహిళతోపాటు, ఆమె భర్తపై కూడా దా-డి-కి పాల్పడ్డారని, 20 మంది వ్యక్తులు మూకుమ్మడిగా దా-డి చేసి, భార్యను ఒకచోట, భర్తను ఒకచోట ఉంచి దు-ర్భా-ష-లా-డు-తూ, ఈ-డ్చు-కుం-టూ, కాళ్లతో తన్నడం జరిగిందని దీపక్ రెడ్డి వివరించారు. (భార్యాభర్తలు మాట్లాడిన వీడియోను ఈసందర్భంగా ఆయన విలేకరులకు ప్రదర్శించారు)

రాయచోటిలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి నామినేషన్లు లాక్కొని చించేశారన్నా రు. నేడు చిత్తూరుజిల్లా పుంగనూరులో నామినేషన్ వేయడానికి వెళుతున్న మహిళను అడ్డుకొని ఆమె పై వైసీపీ కార్యకర్తలు దా-డి-కి పాల్పడ్డారన్నారు. ఆ నియోజకవర్గంలో జరిగిన దా-రు-ణా-ల గురించి ఈసీకి కొన్ని వందల ఫిర్యాదులిచ్చామని, తానే అనేక సార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న వాటిని ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారు. ఈ విధంగా వరుస సఘంటనలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అ-త్యా-చా-రా-ని-కి గురవుతుంటే, స్పందించాల్సిన ఎన్నికల సంఘం చోద్యం చూస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు పెట్టాలనుకున్న ప్రభుత్వం, దానికి రెండు నెలల ముందే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీవారి ఓట్లను తొలగించిందని, కొన్నిచోట్ల డీలిమిటేషన్ పేరుతో గ్రామాలు, వార్డులను మార్చడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందకుండా అధికారులను బె-ది-రిం-చ-డం వంటివి జరిగాయన్నారు. ఈ విధంగా జరిగిన దా-రు-ణా-ల-కు సంబంధించి 189 ఫిర్యాదులను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళితే, వాటన్నింటిపై చర్యలు తీసుకునే సమయం తమకు లేదంటూ, హాస్యాస్పదంగా మాట్లాడడన్నారు.

ప్రతిపక్షం ఇచ్చే ఫిర్యాదులన్నింటి పై చర్యలు తీసుకునే సమయం తమకు ఉండదన్న ఎన్నికల కమిషనర్, స్థానిక రిటర్నింగ్ అధికారులు తమదృష్టికి తీసుకొచ్చిన అంశాలపైనే స్పందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. సంఘటనలపై చర్యలు తీసుకోవడానికి సమయం లేనప్పడు ఎన్నికలు వాయిదా వేయడంగానీ, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం గానీ చేయకుండా, రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి ఏ విధంగా ముందుకెళుతున్నాడో సమాధానం చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం అ-త్యా-చా-రా-ని-కి గురయ్యేలా, తన విధులు తాను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే తప్పుకొని, కేంద్రఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నింటినీ తెలియచేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల క్రతువుకు సంబంధించి ప్రతి అడుగులో టీడీపీ అభ్యర్థులు పోరాడారని, అంతచేసినప్పటికీ చాలాచోట్ల వారిని ఏదో ఒక వంకతో, అధికారపార్టీ అడ్డుకుందన్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక, తాజాగా టీడీపీలోని కీలకనేతలకు ఫోన్లుచేసి బె-ది-రి-స్తూ, వారిని తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారన్నారు.ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే తామిచ్చిన సాక్ష్యాలను ఆధారం చేసుకొని, వైసీపీనేతలు, కార్యకర్తల దౌ-ర్జ-న్యా-ల పై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థలను కుప్పకూల్చి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన వారి నుంచి, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read