తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారు పై క-ర్ర-ల-తో దా-డి చేసి, వారిని చం-పా-లి అని అనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దా-డి చేసిన వీడియో బయటకు రావటం, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆందోళన చెయ్యటంతో, దా-డిలో పాల్గున్న, వైఎస్‌ఆర్‌సిపి పట్టణ సంఘం అధ్యక్షుడు తురకా కిషోర్ ను పోలీసులు పట్టుకుని, హ-త్యా-య-త్నం-కేసు పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తెలుగుదేశం నేతలు కూడా, పోలీసులు హ-త్యా-య-త్నం కేసు పెట్టినందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే, మరుసటి రోజే, కిషోర్ స్టేషన్ బెయిలు పై విడుదల కావటంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన తురకా కిషోర్ పారిపోయాడని తెలుస్తుంది. అతను పరారు అయ్యాడు అంటూ, ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రసారం చేసింది. ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చెయ్యటంతో, ఈ వదనకు బలం చేకూరుస్తుంది.
ముందు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఒక హ-త్యా-య-త్నం కింద అరెస్ట్ చేసిన కేసులో, ఇంత తేలికగా స్టేషన్ బెయిల్ ఎలా వస్తుంది అని, తెలుగుదేశం పార్టీ నిలదీసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, నాన్ బైలబుల్ కేసులు పెట్టమని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు తురకా కిషోర్ పరారు అయ్యాడు అంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ, ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో వార్త రావటం సంచలనంగా మారింది. https://youtu.be/0emBvvljq5E . నిందుతుడు స్వేచ్చగా తిరుగుతున్నారు అంటూ, తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. "హ-త్యా-య-త్నం చేసిన తురకా కిషోర్ కు బెయిల్ ఏవరైనా ఇస్తారా?, ఐసీ ప్రభాకర్ గారు ముద్దాయిపై 3-0-7 సెక్షన్ కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు"
"ఇప్పుడు మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఐజీ ప్రభాకర్ పవర్ ఫుల్లా, మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి పవర్ ఫుల్లా ? స్టేషన్ బెయిల్ తీసుకున్న తురకా కిషోర్ కాలర్ ఎగరేస్తూ బయట తిరుగుతున్నాడు. హ-త్యా-య-త్నం కేసు పెట్టితే 24గంటలు స్టేషన్ కోర్టులో హజరు పర్చాలి.. 14రోజులు రిమాండ్ లో ఉండాలి కాదా?" అంటూ తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన పై నారా లోకేష్ కూడా విమర్శలు చేసారు. "వ్యవస్థల్ని బ్రష్టు పట్టించడంలో YS Jagan Mohan Reddy గారు నెంబర్ 1. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని 14 రోజులు రిమాండ్ కి పంపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హ-త్యా-య-త్నం చేసిన వైకాపా నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి చెబుతారా. పొలిసు వ్యవస్థని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది." అంటూ ట్వీట్ చేసారు.