స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు దా-డు-లు దౌ-ర్జ-న్యా-ల-కు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవటం ఏంటని వైసీపీ తీరు పై , తెలుగుదేశం పార్టీ ప్రతి రోజు ఆందోళన చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు వైసీపీ, అనేక ప్లాన్లు వేసి, టిడిపి నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంది. తస్కరించటం, తిరస్కరించటం, బెదిరించటం, భయపెట్టటం చేసిన వైసీపీ, ఇప్పుడు బహిష్కరించే స్కెచ్ వేసింది. పురపాలక ఎన్నికల్లో విజయం సాధించడానికి తెనాలిలో అధికార పార్టీ శ్రేణులు అడ్డదారులు తొక్కుతున్నాయంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ, సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే మైండ్ పోవాల్సిందే. ప్రత్యర్ధిని ఇలా అడ్డగోలుగా దెబ్బ తియ్యాలి అనే వైసీపీ వ్యూహం చూస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. పులులు, సింహాలు అని చెప్పుకునే వారు, పోటీకి రెడీ అయ్యి, ప్రజల తీర్పు కోరాలి కాని, స్వాతంత్రం వచ్చి, 70 ఏళ్ళు అవుతున్నా, ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి కూడా ఒక పార్టీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏమి చెప్పాలి ? ఇక ఈ వీడియో చూస్తే, మీరు కూడా అవాక్కవుతారు.

tenali 13032020 2

తెనాలి పురపాలిక ఎన్నికల్లో నాలుగోవార్డు నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ప్రవేశించారు. మద్యం సీసాలను వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది. ఉదయం అబ్కారీ అధికారులు తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంకు ఎక్కడ? ఎన్నో ఫ్లోర్ అంటూ ఆరా తీశారు. కాసేపు హడావుడి చేసిన అబ్కారీ సిబ్బంది.. పైఅంతస్తలోని పెంట్‌హౌస్‌లో ఉంటున్న తెదేపా అభ్యర్థి బంధువు తాళ్లూరి కార్తీక్‌ను తీసుకెళ్లారు. అధికారుల తీరుపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలోని వ్యక్తులను గుర్తించకుండా తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలంటూ సీసీ కెమెరా దృశ్యాలను తెదేపా విడుదల చేసింది.

tenali 13032020 3

ఇదే విషయాల పై, నిన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న దా-డు-లు, దౌ-ర్జ-న్యా-ల-ను విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ కలిసి వివరించారు. రాజశేఖర్ రెడ్డి ని చూశాం, ఇలాంటి రౌ-డీలను చాలా మందిని చూశాం, రౌ-డీ-యి-జం చేస్తే అదే మీకు ఆఖరి రోజు. వైసీపీ నేతలకు పిచ్చి పట్టిందా?.. ఒళ్లు కొవ్వెక్కిందా. ధైర్యం ఉంటే నామినేషన్లు వేసి గెలవండి చూద్దాం. నోటిపిషకేషన్లు వేయకుండా అడ్డుకున్న అన్ని చోట్ల రీ నోటిపేషన్ ఇవ్వాలి. దీనిపై న్యాయపరంగా పోరాడుతాం. ఎవ్వర్నీ వదలం, మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు, జగన్ పులివెందులలో ఉండకుండా ఇక్కడెందుకు ఉన్నాడు? మీరు అన్ని చోట్ల తిరగవచ్చు మేం తిరగకూడదా? ఎవర్నీ బెదిరిస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఒక ఊరి నుంచి మరోక చోటకు వెళ్లాంలంటే వీసా కావాలనే పరిస్థితి వస్తుంది. వైసీపీ వ్యవహారశైలిపై ప్రజలు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు మంచి కోసం పాటు పడే తెలుగుదేశం పార్టీ పట్ల నిలబడాలని ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read