క్యాబినెట్ మీటింగ్ లో ఎవరైనా, ప్రజల అవసరాలు గురించి, కొత్త చట్టాలు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చిస్తారు. కాని మన రాష్ట్రంలో మాత్రం, మంత్రులకు వార్నింగ్లు ఇస్తారు. ఎన్నికల్లో గెలవక పొతే, నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి, రాజీనామా చేసి రమ్మంటారు. 90 శాతం స్థానిక సంస్థలు మనమే గెలవాలని, లేకపోతే మంత్రులు రాజీనామా చెయ్యాలని అంటారు. దీంతో మంత్రులకు కూడా తప్పని పరిస్థితి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకం జరుగుతుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషనుల చివరి రోజున రాష్ట్రవ్యాప్తం అ-ల్ల-ర్లు నెలకున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో, టిడిపి వారిని వెంటాడి మరీ, ఇబ్బంది పెట్టింది వైసీపీ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు తుదిగడువు కావడంతో బుధవారం, వైసీపీ మరింతగా రెచ్చిపోయింది. అయితే, ఈ రోజు ఎంత మంది ఎంపీటీసీ నామినేషన్లు వేసారో చూస్తే, టిడిపి అనూహ్యంగా, 95 శాతానికి పైగా నామినేషన్లు వెయ్యగలిగింది. అయితే ఈ నెంబర్ పై, వైసీపీ అసంతృప్తిగా ఉంది.

election 12032020 2

ఎలాగైనా, 50 శాతానికి పైగా ఏకగ్రీవం చేసుకోవాటానికి, వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా సరే, తెలుగుదేశం శ్రేణులు ధీటుగా నిలబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా, ఎంపీటీసీలకు, వైసీపీ, 23,120 నామినేషన్లు వేస్తే, తెలుగుదేశం పార్టీ తరుపున 18,242 మంది నామినేషన్లు వేసారు. అధికార పార్టీ అరాచకాలు తట్టుకుని మరీ 90 శాతం నామినేషన్లు పడ్డాయి. అయితే మిగతా వాటి పై ఇప్పుడు టిడిపి దృష్టి పెట్టింది. ఎక్కడైనా, నామినేషన్ వెయ్యకుండా, వైసీపీ అడ్డుపడిందో, వాటి ఆధారాలు అన్నీ కోర్ట్ కు చూపించి, అక్కడ ఎన్నికలు ఆపటం కాని, నామినేషన్లకు ఎక్కువ సమయం కాని కోర్ట్ ని కోరాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తెసుకుంది. ఏది ఏమైనా 50 శాతం కూడా టిడిపి నామినేషన్ వెయ్యదు అని వైసీపీ అనుకుంటే, ఏకంగా 90 శాతం పైగా నామినేషన్లు వేసి, ఇప్పుడు మిగతా వాటి పై కోర్ట్ కు వెళ్ళటానికి, టిడిపి సిద్ధం అయ్యింది.

election 12032020 3

నిన్న రాష్ట్రంలో నామినేషనుల సందర్భంలో హిం-సా-త్మ-కంగా పరిస్థితులు మారాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ అభ్యర్తి నామినేషన్ వేయడానికి వెళుతుండగా వైఎస్సార్సీ నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్ధి మణెమ్మ చేయి, భుజం పై క-త్తి-తో దా-డి చేసారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావు, న్యాయవాది కిశోర్ల పై దా-డి జరిగింది. వీరి వాహనాలను ధ్వం-సం చేసారు. చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పాడిపేటలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నామినేషను వత్రాలు అధికార పార్టీ సభ్యులు చించేసారని అభియోగం., పుదిపట్ల తెలుగుదేశం అభ్యర్థి హరిప్రియని అధికార పార్టీ సభ్యులు నామినేషన్‌ను వేయనివ్వ లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read