స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ అయిన వైకాపాతో అమీతుమీ తేల్చుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో సాగుతున్న ఆరాచక పాలనపై ప్రజలకు వివరించి అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా పావులుకదుపుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడడంతో ఆ ప్రభావం అన్ని వర్గాల జనజీవనం పై పడిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని యోచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలవుతుందన్న అంశాన్ని ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నవమాసాలు-నవమోసాలు పేరిట ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిన తెదేపా అదే ఊపులో స్థానిక సంస్థల్లో విజయబావుట ఎగుర వేసేందుకు కార్యా చరణను రూపొందించుకుంటోంది. గడచిన పది నెలలుగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో పాటు, అభి వృద్ధి, సంక్షేమానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇదే సమ యంలో సంక్షేమరుణాల నిధులు, వివిధ వర్గాల కేటాయించి న నిధులు పక్కదారి పట్టిన విషయాన్ని ఆయా వర్గాల ప్రజలకు వివరించేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి విజయం సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపు తోంది. ప్రధానంగా పది అంశాలతో ప్రజలను ఆకట్టుకు నేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోనుంది. గడి చిన 26 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఉండగా ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం వైఫ ల్యం వల్ల 24 శాతానికి కుదించబడ్డాయని దీంతో ఆయా వర్గా లు రాజకీయ సాధికారతను కోల్పోయారన్న విషయాన్ని బలంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం ముందు చూపుతో అలోచించి సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీలకు సరైన విధంగా రిజర్వేషన్లు ఇవ్వక పోవాతే, భవిష్యత్తులో, బీసీలు అధికారానికి దూరం అవుతారని, అందుకే, వారికి అండగా నిలబడేందుకు, ప్రభుత్వం ఇవ్వకపోయినా, పార్టీ తరుపున రిజర్వేషన్ ఇచ్చేందుకు టిడిపి రెడీ అయ్యింది. 34 శాతం దాటి, అవసరం అయిన చోట, 50 నుంచి 60 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

అంతేకాకుండా రేషన్ కార్డులు, పింఛన్ల తొలగింపు, ఇసుక మాఫియా, అమరావతి, పోలవరం, ఇళ్ళస్థలాల పేరిట భూముల కబ్దా, జేట్యాక్స్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీల పెంపు,నిత్యావసరా ల పెరుగుదల, పండుగ కానుకలు ఎత్తివేత, అన్న క్యాంటీన్ల మూసివేత, నిరుద్యోగ భృతికి మంగళం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి పింఛన్లు తొలగించడం, 20 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడం వైకాపా ప్రభుత్వ ద్రోహంగా ప్రజలకు వివరిం చనుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న సంక్షేమ పథకాలను, పండుగ కానుకలను ఎత్తివేసి పేదల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ప్రచారానికి సిద్ధమవుతోంది. 35కు పైగా సంక్షేమ పథకాలను ఎత్తివేశారని అంతేకాకుండా నిత్యావసరాల ధరలు ఆమాంతం పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ను ప్రచార అస్త్రాలుగా సంధిచనుంది. మరోవైపు ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్సీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పింఛన్లు ఇస్తామని ప్రకటించిన వైకాపా ఆ హామీని నిలబెట్టు కోలేదని ప్రశ్నిస్తున్న తెదేపా దీనిని కూడా స్థానిక పోరులో ఒక అస్త్రంగా సంధించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను కూడా తెదేపా ప్రచారానికి వినియోగించుకుంది. ముఖ్యంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్ళబకాయిలు, రైతు భరోసా పేరిట బురిడీ కొట్టారని అధికారపక్షంపై తెదేపా ఇప్పటికే మండిపడుతోంది. ఈ అంశాలన్నింటిని ఎన్నికలు అస్త్రాలుగా మలుచుకొని ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట వైకాపా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, అమరావతి తరలింపుపై ప్రజా రిఫరెండంకు తెదేపా సిద్ధమవుతోంది. విశాఖలో అధికారపక్ష నేతలు భూకబ్దాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న తెదేపా కజ్జాల వివరాలను ప్రజాక్షేత్రంలో వెల్లడించనుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో కొత్త ఇసుక, మద్యం పాలసీల వల్లజరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో 50 మందికిపైగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం, ఇసుక మాఫియా ప్రధాన అస్త్రాలుగా ఈ ఎన్నికల్లో సంధించనుంది. ముఖ్యం గా మద్యం అమ్మకాలు అక్రమాలు, జే ట్యాక్స్ వసూళ్ళకు అధికారపక్షం పాల్పడుతుందని విస్తృతమైన ప్రచారాన్ని చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్ర మ కేసులు, అమరావతి ఉద్యమం అణచివేత, పోలవరం పనుల నిలుపుదల, రివర్స్ టెండరింగ్ పేరిట రిజర్వ్ టెండ రింగ్ జరుగుతుందనిబలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పనిలో పడింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్థానిక సంస్థల ఎన్నికల్లో సద్వినియోగం చేసుకునే దిశగా వ్యూహత్మ కంగా అడుగులు వేసేందుకు కార్యాచరణను రూపొందించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ధీటుగా ఎదుర్కొ నేందుకు కీలక కార్యాచరణ అమలు చేసే పనిలో తెదేపా బిజీ.. బిజీ..గా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read