పోలవరం ప్రాజెక్టు అంచనాల్లో భారీగా కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ దాదాపు ఏడాది పాటు పరిశీలన జరిపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాల్లో ఏకంగా వేల కోట్ల రూపాయలను తగ్గించింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఏకంగా రూ.7,823.13 కోట్లకు కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ (ఆర్‌ఈసీ) దాదాపు ఏడాదిపాటు పరిశీలన జరిపి వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం రూ.47,725.74 కోట్ల మేరకు సవరించిన అంచనాలు ఖరారు చేసింది. దిల్లీలో శుక్రవారం ఆర్‌ఈసీ సభ్యులు సమావేశమై పోలవరం తుది అంచనాలు ఖరారు చేశారు. ప్రధానంగా ప్రాజెక్టు పునరావాసం.. ఆ తర్వాత కుడి, ఎడమ కాలువల పనుల వ్యయంలోనే కోత విధించారు. 2017-18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపింది. వీటిని కేంద్ర జలసంఘం దాదాపు ఏడాదిన్నరపాటు పరిశీలించి, అనేక ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత సాంకేతిక సలహా కమిటీకి పంపింది.

polavaram 08032020 2

ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇది ఆర్‌ఈసీ పరిశీలనలో ఉంది. ఏడాది తర్వాత ఇప్పుడు కొలిక్కి వచ్చింది. పోలవరం అంచనాలు ఖరారు చేయడంలో కీలకమైన రెండు కమిటీల ఆమోదమూ పూర్తవడంతో వీటికి ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడమే తరువాయి. ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో దాదాపు రూ.5000 కోట్ల మేర పునరావాస వ్యయంలోనే కోత పడినట్లు సమాచారం. పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించి పని పరిమాణం విషయంలో కమిటీ ప్రశ్నలకు ఇంజినీర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో దాదాపు రూ.2,800 కోట్ల వరకు ఆ పనుల్లో కోత విధించినట్లు సమాచారం.

polavaram 08032020 3

2005-06 ధరల ప్రకారం తొలుత అంచనాలు: రూ.10,151.04 కోట్లకు ఆమోదం. 2010-11 ధరల ప్రకారం అంచనాలు: రూ.16010.45 కోట్లకు ఆమోదం. 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.55,548.87 కోట్లుప్రస్తుతం సవరణ కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.47,725.74 కోట్లు. అయతే ఇంత జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ఎలాంటి ఒత్తిడి లేదనే చెప్పాలి. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్నాయి. మరో పక్క రాజ్యసభ సీటు విషయంలో, బీజేపీ పై ఒత్తిడి పెట్టి, పనులు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా, కేంద్రం పై ఒత్తిడి పెంచకుండా, కేంద్రం ఏది చేసినా, ఏమి చెయ్యకుండా, రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read