అనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్ పర్యటిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో విజయన్ పాల్గొననున్నారు. ఈ బహిరంగసభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకానున్నారు. సీపీఐ నేత నారాయణతోపాటు సీఎం విజయన్‌ను తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కలిసారు. అనంతపురం నగరంలోని జూనియర్ కళాశాల మైధానంలో సోమవారం సాయంత్రంరాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎస్ఆర్ సీ, ఎస్వీఆర్, సీఏపలకు వ్యతిరేకంగా జరుగు బహిరంగ సభలో ముఖ్య అతిథిగా కేరళ సీఎం హాజరు కానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో ఆదివారం రోజే కేరళకు చెందిన భద్రతా అధికారులు అనంతపురం వచ్చారు. బహిరంగ సభ జరుగుతున్న జూనియర్ కళాశాల మైధానాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సభలో కేరళ సీఎంతోపాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ తదితరులు పాల్గొంటారు. ఈ సభకు అనంతురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలే కాకుండా కడప, కర్నూలు ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించేందుకు రాజ్యాంగ పరిరక్షణ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న కేరళ సీఎంకు సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో విజయన్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో బెదిరింపులతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ను వారు కలిశారు. జ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో లౌకికవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలువునిచ్చారు.
అయితే, పక్క రాష్ట్ర సియం వచ్చి, ఇక్కడ ముస్లింలకు భరోసా ఇవ్వటంతో, ఇక్కడ ఉన్న జగన్ మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే జగన్ పై, ఈ విషయంలో అన్ని పక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముస్లింల ఓట్ల కోసం ఎన్ పిఆర్, సిఏఏపై డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో సై అని, ఇక్కడకు వచ్చి వ్యతిరేకంగా అంటున్నారని విమర్సలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు డ్రామాలు ఆడుతున్నారని ముస్లిం సంఘాల నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే దీనిపై జీవో 102ను ఆగస్ట్ 16న విడుదల చేసేవారే కాదని అన్నారు. ఆగస్టులో జీవో ఇచ్చి ఇప్పుడు మేము వ్యతిరేకం అంటే నమ్మడానికి ముస్లింలు సిద్దంగా లేరని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ముస్లింల ఓట్ల కోసం జగన్నాటకం ఆడుతున్నారని, ఎన్ పిఆర్, సిఏఏ,ఎన్ ఆర్ సిలను అడ్డుకోవాలన్న చిత్తశుద్ది వైసిపి ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. అనేక రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించినా మన అసెంబ్లీలో దీనిపై కనీసం చర్చించక పోవడం, తీర్మానం ఆమోదించక పోవడమే అందుకు నిదర్శనంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.