ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన తరువాత ఆయన నోటినుంచి ఒక్కమాట కూడా రాలేదని, ప్రధాని, ఇతరమంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలను పబ్లిక్‌డొమైన్‌లో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని, టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడుతూ, కేంద్రమంత్రులకు విడివిడిగా వినతిపత్రాలిచ్చిన ముఖ్యమంత్రి, వాిలోని వివరాలను వెల్లడించడానికి ఎందుకు సంకోచిస్తున్నాడన్నారు. కనీసం మీడియాముందు కు కూడా రాలేని నిస్సహాయస్థితిలో సీఎం ఎందుకున్నాడో చెప్పాలన్నారు. మంత్రి బొత్స ఒకప్రముఖ పత్రికాసంస్థ అధినేతకు లేఖరాశారని, దానిలో తాను అననిమాటలను అన్నట్లుగా రాసినట్లు ఆయన ఆరోపించారని దేవినేని తెలిపారు. అదేవార్తను టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రభ పత్రికలుకూడా ప్రచురించాయని, బొత్స వాటికి ఎందుకు నోటీసులివ్వలేదని దేవినేని ప్రశ్నించారు. వైసీపీప్రభుత్వం ఎన్డీఏలో చేరుతున్నట్లు మంత్రే ప్రకించారంటూ, అందుకు సంబంధించిన వీడియోను ీడీపీనేత విలేకరుల ఎదుట ప్రదర్శించారు. జగన్‌ ఒత్తిడివల్లే బొత్స 1974, ఆగస్ట్‌10న ప్రారంభమైన ప్రముఖ తెలుగుదినపత్రిక వ్యవస్థాపకుడికి నోీసు ఇచ్చాడని, ఆయనవైఖరి చూస్తుంటే, సీఎం, సాక్షిమీడియా ఎంతలా భయపడుతున్నాయో అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు, సదరుపత్రికా యజమాని వయస్సుని గురించి హేళనగా మ్లాడుతున్న మంత్రులంతా ఒక్కసారి వారి బతుకులేమిో, ఎక్కడినుంచి వచ్చారో ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 2018-19లో దేశంలోనే పెట్టుబడులు ఆకర్షణలో ఏపీ మూడోస్థానంలో నిలిచి, రూ. 70వేలకోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని, వైసీపీవచ్చాక రూ.లక్షా80 వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి వెనక్కువెళ్లాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే చెప్పిందన్నారు. ఈ అంశాన్ని వదిలేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి పదేపదేపాతపాటే పాడుతూ పాచిపళ్ల దాసుడిగా తయారయ్యాడన్నారు. కియావెళ్లిపోవడం గురించి, కియా అనుబం ధపరిశ్రమలు తరలిపోవడం గురించి, విశాఖలో ఉండాల్సిన సంస్థలు వెనక్కువెళ్లడం గురించి మ్లాడలేని బుగ్గన, అసెంబ్లీలో చెప్పిన రాజధానిభూముల ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ కి సంబంధించిన తప్పులప్రసంగాన్నే, నేడుకూడా చదివి వినిపించాడన్నారు. అమరావతి పై విషం చిమ్మడంతప్ప, బుగ్గనకు, ఇతరమంత్రులకు రాష్ట్రంలోని ఇతరసమస్యలు పట్టడంలేదన్నారు.

రాజధానిలోని ఎస్‌ఆర్‌ఎం, వ్‌ి విశ్వవిద్యాలయం, అమృతమయ విశ్వవిద్యాలయాలు మూసేసి, విజ్ఞాన్‌సంస్థలకు లాభంచేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థికఎమర్జన్సీ వస్తున్నా కూడా బుగ్గన తన బురదజల్లే ప్రయత్నాలు మానుకోవడంలేదన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రులంతా బాధ్యతలేకుండా, వారిశాఖలపై అవగాహనలేకుండా మ్లాడు తున్నారని, ధాన్యం, మిర్చి, సుబాబుల్‌రైతులు గిట్టుబాటుధరలేక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు మిర్చియార్డులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రైతులను దోచుకుంటుంటే, ఆయనేమో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. వైసీపీమంత్రులు, సాక్షిమీడియా వార్తలుచూస్తుంటే, వారేదో మానసికజాడ్యంతో బాధప డుతున్నట్లుగా అనిపిస్తోందని, ఐీశాఖ సోదాలు నిర్వహించిన శ్రీనివాస్‌, కిలారిరాజేశ్‌ ల ఇళ్లలో దొరికినసొత్తుపై ఆశాఖ ఇచ్చే పంచనామా లేకుండా పిచ్చిపిచ్చిరాతలు ఎలా రాస్తారని టీడీపీనేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు.

పంచనామా ప్రచురించ కుండా, ఐటీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు రాయకుండా తప్పుడు వార్తలురాసిన సాక్షిపత్రి కపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షిపత్రికకు నీతి, నిజాయితీ ఉంటే, ఐీసోదాలు జరిగిన మూడుకంపెనీల గురించి ఎందుకు రాయడంలేదన్నారు. పూర్తిగా విషప్రచారం చేయడం మానకపోతే, సాక్షిని, ఆసంస్థ యాజమాన్యాన్ని కోర్టుల్లో దోషులు గా నిలబ్టెి తీరుతామని అశోక్‌బాబు తేల్చిచెప్పారు. ఐీశాఖ వివరణను కనిపించి, కనిపించకుండా ప్రచురిస్తూ, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌, కిలారి రాజేశ్‌ల చిత్రాలను, వారి వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో వేయడం సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమేనని అశోక్‌బాబు దుయ్యబ్టారు. సాక్షి వార్తలో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా వాస్తవాలు కనిపించడంలేదని, చంద్రబాబు ని, లోకేశ్‌ని దోషులుగా చూపాలన్న తాపత్రయం తప్ప, ఐీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు ఇవ్వకుండా తప్పుడువార్తలు రాయడం సిగ్గుచేటని ీడీపీనేత, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దుయ్యబ్టారు. జర్నలిజంలో కనీసవిలువలను పాించని సాక్షి మీడియాను బ్యాన్‌చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆధారాలు లేకుండా మసి పూసి మారేడుకాయగా ఏమార్చే ప్రక్రియను నమ్ముతున్న సాక్షి, తన హీనమైన చర్యలతో మీడియావ్యవస్థకే కళంకంగా మారిందన్నారు. మంత్రులుకూడా జ్ఞానంలేకుండా సాక్షి రాతలనే పట్టుకొని పిచ్చిపిచ్చిగా మ్లాడటం సరికాదన్నారు. ఐీశాఖ తాను నిర్వహించి న సోదాల్లో ఎక్కడాకూడా చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పలేదన్నారు. నిజంగా టీడీపీనేతలు తప్పుచేసి ఉంటే, అధికారంలోఉన్న వైసీపీ, చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకడుగు వేస్తోందని శ్రావణ్‌ ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read