ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సాధించిందేమిటని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, అభివృద్ధి నిధులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర వాటి గురించి ఏమీ మాట్లాడనపుడు ఆయన ఢిల్లీ వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వద్ద 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన వేల కోట్ల నిధు లను అడిగే దమ్ము, ధైర్యం ఆయనకు లేవా అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దేశాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాగా, దేశంలో బీజేపీని నిలదీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ చమత్కరించారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ ముందు సరెండర్ అయ్యారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న విజయన గరం జిల్లాకు బుందేల్‌ఖండ్ మాదిరిగా కేంద్రం రూ.5వేల కోట్లు ప్యాకేజీ ఇస్తే పక్క జిల్లాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింద న్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ వలసలు నిరోధించగలిగామన్నారు. దళిత మైనార్టీలను కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ నిలదీస్తే, కాంగ్రెస్ మీకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పాటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీల మీద సుప్రీం కోర్టు తీర్పును పునఃపరిశీలన చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆనాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే దివంగత వైఎస్ రాజు శేఖరరెడ్డి అంతిమ లక్ష్యమని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి, 42 ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్తూ ఉండే వారని గుర్తు చేసారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కూడా, ఈ ఆశయం కోసం పని చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు మాత్రం, జగన్ పూర్తీ భిన్నంగా ఉన్నారని అన్నారు. అలాంటి నాయన పేరు చెప్పుకొని నేడు కాంగ్రెస్ కు బద్ద శత్రువులుగా ఉండే బీజేపీ ముందు జగ న్మోహన్ రెడ్డి తన అధికారం కోసం ప్రధాని మోదీ, అమిత్ షాలకు వంగి వంగి దండాలు పెడుతున్నాడని వ్యంగ్యంగా అన్నారు. రెండు రోజుల నుంచి వస్తున్న ఫోటోలు చూసి, వైఎస్ఆర్ ఆత్మ క్షోబిస్తుందని, శైలజానాథ్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read