15వ ఆర్థికసంఘ విధివిధానాలను సవరించాలన్న డిమాండ్‌తో అక్టోబర్‌ చివరి వారంలో ఢిల్లీలో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఇందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, ఆర్థికరంగ నిపుణులు, రాజకీయపార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్ర‌వారం ఢిల్లీలో జ‌రిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకొచ్చిన యనమల అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం నాటి సమావేశంలో కేరళలో ఇటీవలి జలప్రళయ నష్టాన్ని సరిదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం ఎస్‌జీఎస్‌టీపై సెస్‌ వేసుకోవడానికి జీఎస్‌టీ కౌన్సిల్‌ అనుమతి కోరగా.. తాము మద్దతు పలికినట్లు తెలిపారు.

cbn 30092018

అయితే జాతీయ స్థాయి సమస్యలను కేంద్ర ప్రభుత్వం సెస్‌తో ముడిపెట్టాలని చూస్తోందని, దానికి తాము వ్యతిరేకమని యనమల వెల్లడించారు. ఇటీవల చక్కెరపై సెస్‌ వేయడానికి కేంద్రం ప్రయత్నించగా తాము అంగీకరించలేదని పేర్కొన్నారు. పంటలు దెబ్బతినడం, ధరలు పడిపోవడం వంటి ఘటనలను ప్రకృతి వైపరీత్యాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. నష్టపోయిన రాష్ట్రాల్లో సెస్‌ వేసుకుంటే బాగుంటుందని, దానిని అన్ని రాష్ట్రాలపై రుద్దడాన్ని తాము అంగీకరించడం లేదన్నారు. భవిష్యత్తులో అదే సంప్రదాయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను మార్చాలన్న డిమాండ్‌పై తొలి నుంచి పోరాడుతున్న కేరళ ఆర్థికమంత్రి, దిల్లీ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి ఆర్థికమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై అక్టోబర్‌ చివరి వారంలో దిల్లీలో రెండురోజులపాటు సెమినార్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

cbn 30092018

అదేవిధంగా జీఎస్‌టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగినందున కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించబోదని యనమల రామ‌కృష్ణుడు తెలిపారు. శుక్రవారంనాటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ఆదాయాల గురించి విశ్లేషించి, ఆంధ్రప్రదేశ్‌ కనబరుస్తున్న పనితీరును అభినందించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. రక్షిత ఆదాయం కంటే ఒక్క శాతం అధికంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్‌టీ పరిహారం రాదన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సన్నద్ధమౌతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వాట్సాప్‌ను ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవాల ని నిర్ణయించింది.పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకత్వాలకు సందేశాలి చ్చారు. వాట్సాప్‌ ప్రచారానికి సెల్‌ ఫోన్‌ ప్రముఖ్‌ గా నామకరణంచేశారు. బూత్‌ స్థాయి కార్యకర్తలను కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకునే ఉద్దేశంతో బీజేపీ సెల్‌ఫోన్‌ ప్రముఖ్‌ను ప్రారంభించబోతోం ది. ప్రతీ బూత్‌ స్థాయిలో ముగ్గురికి వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియేట్‌ చేయిస్తారు.

wa 30092018

ప్రతీ గ్రూప్‌లో 256 మంది సభ్యులను చేర్చడం క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను అధినాయ కత్వాన్ని తెలియజేయడం సెల్‌ఫోన్‌ ప్రముఖ్‌ ముఖ్య ఉద్దేశం. వీడియో, ఆడియో, టెక్స్ట్‌ ,గ్రాఫిక్‌,కార్టూన్స్‌ ద్వారా ఓటర్ల ను బీజేపీవైపు మళ్లించడమే వాట్సాప్‌ గ్రూప్‌ల ప్రధాన లక్ష్యం. వాట్సాప్‌ ప్రచారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు వారాల క్రితమే బీజేపీ సీనియర్లతో సమావేశమై.. డిజిటల్‌ కాంపెయిన్‌పై చర్చించారు. వాట్సాప్‌ ద్వారా ఎన్నికల ప్రచారం ఏ విధంగా సక్సెస్‌ చేయవచ్చో సీనియర్‌ అధికారులు మోడీకి వివరించినట్లు తెలుస్తోంది.

wa 30092018

2019 లోక్‌సభ ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందునుంచే వాట్సాప్‌ వార్‌ను ప్రారంభించాలని బీజేపీ భావిస్తోంది. ఈలోపే రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలోని సెల్‌ఫోన్‌ ప్రముఖ్‌ను గుర్తించి దిశానిర్దేశం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. దేశంలో 100 కోట్ల 14 లక్షల మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు ఉండగా.. కనీసం 20 లక్షల మందికి వాట్సాప్‌లు ఉపయోగిస్తున్నట్లు అంచనా. అయితే సోషల్‌ మీడియాను వాడుకోకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం అంత సులువుకాదని పలువురు పార్టీ ఐటీ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సోషల్‌ మీడియాను వాడుకుంటూనే వాట్సాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ అధినాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.

మూడు రోజుల నుంచి తెగ ఊగిపోతున్న పవన్ కళ్యాణ్, నిన్న వీకెండ్ కావటంతో, వీకెండ్ ధమాకా చూపించారు. కాళ్ళు విరిచేస్తా, తాట తీస్తా, రాడ్లు పెట్టి కొడతా దగ్గర నుంచి, మీరు పిచ్చికుక్కలు అనే స్థాయికి దిగజారి పోయాడు పవన్... శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘నేను సినిమా హీరోను కాను. ఉద్యమకారుడిని. పద్నాలుగేళ్ల వయసు నుంచే రాజకీయాలను అర్థం చేసుకుంటున్నా. మీవి విడిపోయిన రెండు వేళ్లు. మాది ఐదు వేళ్లూ బిగించిన పిడికిలి. మీ పద్ధతి మార్చుకోండి. బెదిరింపులు మానండి. లేదంటే దెబ్బకు దెబ్బ తీస్తాం పిచ్చి కుక్కల్లారా’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు.

pk 300092018 2

తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంపై స్పందిస్తూ... ‘‘భయం ఉంటే రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాను. సమస్యలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన జనసేనానికి భయం ఎలా ఉంటుంది? 18 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటం చేయడానికి సిద్ధపడిన వాడిని’’ అని తెలిపారు. రక్షణ పేరిట తనపై నిఘా పెట్టారని... అందుకే పోలీసులను వెన క్కి పంపించేశానని తెలిపారు. ఏలూరు శివారులో బస చేసిన తమపై దాడికి పాల్పడిన 30 మందిని పట్టుకుని పోలీసులకు అప్పజెబితే ఏంచేశారని ప్రశ్నించారు. ‘‘మేం సుపరిపాలనను కోరాం. మీరు అరాచక పాలనను ప్రజలపై రుద్దారు. జాగ్రత్తగా వ్యవహరించండి. 2019 నుంచి రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి" అంటూ చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు పవన్...

pk 300092018 3

చంద్రబాబు ఎప్పుడూ రెండు వేళ్లు చూపిస్తూ, విక్టరీ సింబల్ చూపిస్తారు. చంద్రబాబుని ఉద్దేశిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లడారు. చంద్రబాబు లాంటి నాయకుడిని, పవన్ లాంటి క్యారక్టర్ లేని వ్యక్తి, ఇలా పిచ్చికుక్కల్లారా, అంటుంటే,బ్యూటీ అఫ్ డెమోక్రసీ తప్ప ఏమి అనుకోవాలి ? జగన్ లాంటి వాడు కాల్చేస్తా అన్నా, పవన్ లాంటి వాడు ఇలా మాట్లాడినా, అంబటి, వాసిరెడ్డి పద్మ, రోజా లాంటి వారు జుబుక్సాకరంగా మాట్లాడినా, చివరకు తెలంగాణాలో ఉన్న బాల్కా సుమన్ అనే వాడు, ఇష్టం వచ్చినట్టు కూసినా, చంద్రబాబు ఇలాంటి వారిని అసలు పట్టించుకోరు కాబట్టి, వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎందుకంటే ఆయనకు ఉన్న లక్ష్యాలు వేరు. ఇలాంటి అల్ప జీవులతో, చిల్లర పంచాయితీ పెట్టుకోరు. నవ్యాంధ్ర నిర్మాణం, పోలవరం, అమరావతి ముందు, ఇలాంటి వారి మాటలు ఆయన పట్టించుకుంటారా ? అందుకే వీళ్ళు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. సరైన సమయంలో, ప్రజలే బుద్ధి చెప్తారు...

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో కరపత్రం విడుదలయింది. ఈ కరపత్రం వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కరపత్రంలో... ‘నేనొక మాజీ ఎమ్మెల్యేని, ఆరుగురు పిల్లలు, భార్య కలవాడిని, ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగాలు కూడా లేవు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వార్నింగ్‌ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? ఇంత వరకు చెప్పలేకపోయారు? నేను ఏవర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి? కుహనా హక్కుల సంఘలైనా మీరైనా చెప్పండి ? అంటూ పేర్కొంది. ఈ ప్రశ్నల దిగువున సివేరి సోమ అంటూ హత్యకు గురై రక్తపు మడుగుల్లో చనిపోయిన మృతదేహం ఫొటోతో పాటు పాస్‌పోర్టు ఫొటో కూడా ముద్రించి ఉంది. ఎర్రని పేపర్లో పసుపు అక్షరాలతో కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం వాట్సాప్‌ల్లో హల్‌చల్‌ చేస్తోంది.

soma 30092018 2

మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబీకులు తమను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న సోమ మరణంతో ఆయన మీద ఆధారపడి ఉన్న తాము దిక్కులేని వారమయ్యామని తెలిపారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. అలాగే సోమకు స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పించాలని, పిల్లలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంటి నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. వీటికి సీఎం సానుకూలంగా స్పందించారు.

soma 30092018 3

అరకు వెళ్లిన ముఖ్యమంత్రి సోమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. ఏడుగురు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే తెదేపా తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇవ్వడమే కాకుండా సోమ రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు విశాఖలో ఇంటి స్థలం.. అరకులో నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న సీఎం.. సౌమ్యుడైన సోమను హతమార్చడం దారుణమన్నారు. సోమ కుటుంబానికి రాజకీయంగా కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read