విజిలెన్స్ కమిషన్ కార్యాల యాన్ని కర్నూలుకు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చీఫ్ సెక్రటరి నీలం సాహ్నిని కలిసి విజ్ఞప్తి చేశామని సెక్రెటరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలిలెన్స్ కమీషన్ 'క్వాజీ జుడీషయరీ' అయినా అందులో పనిచేసే సిబ్బంది సెక్రెటరియేట్ ఉద్యోగులు కాబట్టి ఎక్కడ సెక్రెటరియేట్ ఉంటే అందులోనే విజిలెన్స్ కమీషనర్, ఆఫ్ ఎక్వెరీస్ కార్యాలయాలు ఉంచాలని సీఎస్ నీలం సాహ్నిని కోరామని తెలిపారు. ఇందులో పనిచేసే సిబ్బంది అందరూ సెక్రెటరియేట్ ఉద్యోగులేనని, డిపార్ట్మెంట్ ట్రాన్స్ ఫర్స్ అయినా, ప్రమోషన్లు వచ్చినా సెక్రటరియేట్ శాఖల్లోనే వస్తాయన్న విషయాన్ని కూడా సీఎస్ దృష్టికి తీసుకవెళామని తెలిపారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటులో భాగంగా విజిలెన్స్ కమీషనర్, కమీషనర్ ఆఫ్ ఎక్వరీస్ కార్యాలయాలు కర్నూలుకు మారుస్తూ జీవో ఇచ్చామని, మీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని సిఎస్ హామీ ఇచ్చారని తెలిపారు.
కర్నూలుకు విజిలెన్స్ కమీసనర్, కమీషనర్ ఆఫ్ ఎక్వెరీస్ కార్యాలయాలు తరలించడంపై కోర్టులో ఉన్న వాజ్యంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సెక్రెటరియేట్ లోనే ఈ కార్యాలయాలు ఉంచాలని తాము కోరుతున్నామని తెలిపారు. సెక్రెటరియేట్ ఎక్కడికి మార్చినా అభ్యంతరం లేదని.. ప్రభుత్వం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి వెళ్లి పనిచేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంకు మార్చితే అక్కడికి వెళ్లి పనిచేస్తామని తెలిపారు. సెక్రెటరియేట్ విశాఖకు మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉద్యోగులకు అలాంటి ఇబ్బందులు మామూలే అన్నారు. హైదరాబాద్ నుండి మార్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉద్యోగులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైజాగ్ వెళ్ళటానికి, మేము సిద్ధం అని అన్నారు.
అయితే ఈ ప్రకటన పై, విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క వైజాగ్ కు వెళ్ళటానికి మాకు ఏమి ఇబ్బంది లేదని, ఎక్కడికైనా ప్రభుత్వం వెళ్ళమంటే వెళ్తాం అని, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాం అని చెప్తున్న వెంకట్రామిరెడ్డి, కర్నూల్ వెళ్ళటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి ? ప్రభుత్వం చెప్తే ఎక్కడికైనా వెళ్తాం అని చెప్తూ, సచివాయలం ఎక్కడ ఉంటే, మేము అక్కడే ఉంటాం అని ఎందుకు చెప్తున్నారు ? ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళమంటే, అక్కడికి వెళ్తాం అంటారు, కాని కర్నూల్ కి వెళ్ళమంటే మాత్రం, అమ్మో అంటున్నారు. వారి దాక వస్తే కాని నొప్పి తెలియదా అని కొంత మంది సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.