సీఆర్‌డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జర్క్ తో, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ షాక్ తింది. శాసనసభలో 151 స్థానాలతో, తిరుగులేని శక్తిగా, జగన్ ఏమి అనుకుంటే, అది జరిగేలా ఉన్న వైసీపీ, అసెంబ్లీలో బిల్లులను ఆమోదిస్తే, శాసనమండలిలో దానికి బ్రేక్ పడటం, అది కూడా టిడిపి అనుకోకుండా, వేరే వ్యుహంతో వచ్చి షాక్ ఇవ్వటం, ఏమి చెయ్యలేని స్థితిలో వైసీపీ ఉండి పోవటంతో, జగన్ షాక్ తిన్నారు. తన మాటకు ఎదురు చెప్పిన మండలి ఉండటానికి వీలు లేదు అంటూ నిర్ణయానికి వచ్చారు. వెంటనే, మండలి రద్దు తీర్మానం, అసెంబ్లీలో పెట్టి, చర్చించి, బిల్లుని ఆమోదించి, గవర్నర్ వద్దకు, అక్కడ నుంచి కేంద్రానికి పంపించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. మండలి రద్దు వల్ల వైసీపీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాసం కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి.

ఇక దీంతో పాటుగా, వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో, దాదపుగా 25 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. వాటి పై ఇప్పటికే అనేక మంది కన్ను వేసారు. జగన్ దగ్గర హామీ కూడా పొందారు. అయితే ఇప్పుడు మండలి రద్దుతో వారికి జగన్ ఏమి సమాధానం చెప్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి,మండలి స్థానంలో, ప్రాంతీయ మండల్లు తెస్తున్నారని, అవి కూడా ఎమ్మెల్సీకి సమానంగా హోదా కలిగి ఉంటారని ప్రచారం చేస్తున్నారు. అయితే వీటి పై ఎవరూ ఆసక్తి చూపటం లేదు. జగన్ తొందర పాటు నిర్నయం తీసుకున్నారని అంటున్నారు. ఈ నిర్ణయం ఇప్పట్లో తెలియదు అని, రాను రాను, ఈ పరిస్థితి గురించి, రాజకీయంగా ఎంత డ్యామేజ్ అనేది జగన్ కు అర్ధం అవుతుందని అంటున్నారు.

ఈ నిర్ణయంతో ఇప్పుడు గన్నవరం పరిస్థితి మరింత క్లిష్టంగా మారబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం, చంద్రబాబుని విమర్శించి, జగన కు జై కొట్టడంతో ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన, వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండటానికి జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. ఆ ఒప్పందం మీదే, వెంకట్రావ్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ అవకాశం లేదు. రేపు బై ఎలక్షన్ వస్తే, వంశీ, వెంకట్రావు ఇద్దరికీ టిక్కెటు ఇచ్చే అవకాశం లేదు. దీనితో ఇద్దరిలో ఒకరికి ఇబ్బంది తప్పదు. కాదు కూడదు అనుకుంటే వెంకట్రావుని రాజ్యసభకు పంపాలి. అయితే ఇప్పటికే రాజ్యసభ ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. దీంతో, మండలి రద్దు ఎఫెక్ట్ మొదటగా, గన్నవరం మీదే పడే అవకాసం కనిపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read