రాజ్యసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజ్యసభలో, దేశంలో ఉన్న అందరి ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసుల విషమై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ తరుపున, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడారు. ఆయన ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసుల విషయం ప్రస్తావిస్తూ, జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న 11 సిబిఐ కేసుల గురించ ప్రస్తావించారు. జగన్ మొహన్ రెడ్డి పై, ఎన్నో అక్రమ ఆస్తుల కేసులు నమోదు అయ్యాయని, సిబిఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసింది అంటూ, కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వారం వారం కోర్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు. అయితే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వటంతో, వారం వారం నేను కోర్ట్ రాలేను అంటూ, ఆయన కోర్ట్ ల్లో పిటీషన్ వేసారని, చెప్పుకొచ్చారు. అలగే జగన్ కేసుల ప్రస్తావన, ఆయన పై ఉన్న కేసులు, జగన్ కోర్ట్ మినహాయింపు కోరుతూ, వేస్తున్న పిటీషన్లు ఇలా అన్ని విషయాలు సభ ద్రుష్టికి తీసుకు వచ్చారు.
అయితే కనకమేడల రవీంద్ర కుమార్మ జగన్ పేరును సభలో ప్రస్తావించడం పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ఒక వ్యక్తీకి సంబంధించిన విషయం కాదని, ఇది ఒక విస్తృతమైన అంశమని, కేవలం ఆ అంశానికి కట్టుబడి చర్చ జరగాలని, ఏ రాష్ట్రం పేరు గానీ, వ్యక్తిగతంగా పేరును గానీ ప్రస్తావించ వద్దు అంటూ, వెంకయ్య నాయుడు కనకమేడలకు సూచించారు. అయితే చైర్మన్ వెంకయ్య ఒకపక్క చెబుతుండగానే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కనకమేడల ప్రసంగానికి అడ్డుపడ్డారు. జగన్ పేరును ఎలా ప్రస్తావిస్తారు అంటూ, అభ్యంతరం చెప్పారు. కనకమేడల ప్రసంగించిన అంత సేపు, విజయసాయి రెడ్డి పక్క నుంచి అరుస్తూ, అభ్యంతరం చెప్తూనే ఉన్నారు.
అయితే విజయసాయిరెడ్డి కలుగజేసుకోవడంపై చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానంలో తాను ఉన్నానని వెంకయ్య విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చెప్పారు. కనకమేడల వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించడంపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని వెంకయ్య నాయుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయసాయి, యు ఆర్ నాట్ మినిస్టర్, సిట్ డౌన్ అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. జగన్పై ఉన్న సీబీఐ కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కనకమేడల చెప్తూ, తన ప్రసంగం ముగించారు.