జగన్ మొహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, తనకు వారం వారం కోర్ట్ నుంచి వ్యక్తగత మినహాయింపు ఇవ్వాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా హైకోర్ట్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. అయితే సిబిఐ తరుపున న్యాయవాది స్పందిస్తూ, తమ వైపు నుంచి కౌంటర్ వెయ్యటానికి, తమకు మరి కొంత సమయం కావాలని, హైకోర్ట్ ని కోరారు. దీంతో ఈ కేసు విచారణ ఈ రోజు ఏమి తేలకుండానే వచ్చే నెల 12కు వాయిదా పడింది. ఈ నేపధ్యంలో, కోర్ట్ ఏమి రిలీఫ్ ఇవ్వక పోవటంతో, రేపు జగన్ మొహన్ రెడ్డి శుక్రవారం కావటంతో, కోర్ట్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు జగన్ మోహన్ రెడ్డి, ఈడీ కేసుల వ్యవహారంలో, ఆయన రేపు కోర్ట్ కు హాజరు అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రేపు నాంపల్లి సిబిఐ కోర్ట్ కు వస్తున్న విషయాన్ని, తెలంగాణా పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పినట్టు సమాచారం వస్తుంది. ఈ నేపధ్యంలో, రేపు జగన్ మోహన్ రెడ్డి, నాంపల్లి సిబిఐ కోర్ట్ కు హాజరు కానుకున్నారు అని అర్ధం అవుతుంది.

పోయిన శుక్రవారమే జగన్ మోహన్ రెడ్డి, తప్పని సరిగా కోర్ట్ కు హాజరు కావాలని, కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే, కోర్ట్ లో జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు అబ్సెంట్ పిటీషన్ వెయ్యటంతో, న్యాయమూర్తి ఆ ఒక్క రోజుకు ఒప్పుకున్నారు. ఈ నేపధ్యంలోనే రేపు శుక్రవారం కావటంతో, అటు హైకోర్ట్ లో కూడా రిలీఫ్ రాక పోవటంతో, జగన్ మోహన్ రెడ్డి, తప్పని పరిస్థితిలో కోర్ట్ కు హాజరు అవుతున్నారు. అయితే, రేపు సిబిఐ కోర్ట్ జడ్జి సెలవులో ఉంటారని సమాచారం ఉన్నా, జగన్ హాజరు తప్పని సరి కావటంతో, ఆయన రేపు విచారణకు వెళ్తున్నారని సమాచారం వచ్చింది. ఈ నేపధ్యంలోనే, నాంపల్లి సిబిఐ కోర్ట్ ప్రాంగణంలో, భద్రతా ఏర్పాట్లు చూడాలని, ఏపి అధికారులు, తెలంగాణా అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి అటు సిబిఐ విచారణకు, ఇటు ఈడీ కేసుల విచారణకు తాను శుక్రవారం శుక్రవారం రాలేను అని, తనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయని, తన తరుపున, సహా నిందితుడు వస్తారని, కోర్ట్ కు తెలిపారు. అయితే సిబిఐ కోర్ట్ లో, అటు సిబిఐ విచారణ, ఇటు ఈడీ విచారణ గురించి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరినా, సిబిఐ కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా హైకోర్ట్ కు, తనకు విచారణ మినహాయింపు ఇవ్వాలని కోరారు. సిబిఐ కోర్ట్ ఇప్పటికే ఈ పిటీషన్ ను రెండు సార్లు కొట్టేసింది. అదే విధంగా హైకోర్ట్ కూడా ఇప్పటికే ఒకసారి కొట్టేసింది. ఇది రెండో సారి. అయితే జగన్ పిటీషన్ పై, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. ఈ విషయం పై ఇంకా సమయం కావాలి అని సిబిఐ కోరటంతో, విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు .

Advertisements

Advertisements

Latest Articles

Most Read