కేంద్ర బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యెక హోదాతో పాటుగా, ఒక్క విభజన హామీని కూడా, కేంద్రం బడ్జెట్ లో పట్టించుకోలేదు. ఏడాది క్రితం ప్రకటించిన రైల్వే జోన్ అడ్డ్రెస్ లేదు. అడనప్డు కేటాయింపులు లేవు. విద్యాసంస్థలకు నిధులు కేటాయింపు లేదు. కొత్త రైల్వే లైన్ల ఊసే లేదు. ఇలా అనేక హామీలు, కేటాయింపులు కేంద్రం చెయ్యలేదు. సహయం చెయ్యకపోగా, 15వ ఆర్ధిక సంఘంతో, రాష్ట్రానికి వచ్చే వాటా తగ్గిపోయింది. అయితే రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ మాత్రం, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, ప్రశ్నించటంలో విఫలం అయ్యింది అనే చెప్పాలి. 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి, ప్రత్యెక హోదా తెస్తాం అని చెప్పిన జగన్, ఇప్పుడు మెడలు వంచటం సంగతి ఏమో కాని, కనీసం మాట్లాడటానికి కూడా, అడ్డ్రెస్ కనిపించటం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి, ఇప్పటికి 10 రోజులు దాటింది. అయినా, వైసీపీ ఒక నిరసన చెయ్యటం కాని, గట్టిగా కేంద్రాన్ని అడగటం కాని జరగలేదు.
ఈ రోజు బడ్జెట్ సమావేశాల పై, పార్లమెంట్ లో చర్చ జరిగింది. అలాగే రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. రాజ్యసభలో బిడ్జెట్ ప్రసంగం జరిగే సమయంలో వైస్సార్సీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీ విజయసాయిరెడ్డి పేరుని, చైర్మెన్ పిలిచారు. అయితే, ఆయన పేరు పిలిచినప్పుడు సభలో విజయసాయి రెడ్డి లేరు అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర బిడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేసింది అని విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి, బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం సమయంలో హాజరుకపోవడం చర్చియాంశంగా మారింది. కేంద్ర పెద్దలను మంచి చేసుకుంటానికి, ఇలా చేసారా ? లేక ముందే చైర్మెన్ కు చెప్పరా అనేది తెలియాలి. అయితే, ముందు చెప్పి ఉంటే, అసలు చైర్మెన్ పిలిచే వారే కాదని అంటున్నారు.
ఇక మరో పక్క ముగ్గురు ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, కేంద్రం పై విమర్శలు గుప్పించింది. గత ఎనిమిది ఏళ్ళుగా బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారంటూ, బీజేపీ పై విరుచుకు పడ్డారు, రామ్మోహన్ నాయుడు. రాజకీయాలతో ఏపీ అన్యాయమైపోతోందని అన్నారు. వైజాగ్‌కు రైల్వేజోన్ ఇచ్చామన్నారని, కాని ఆదాయమిచ్చే ప్రాంతం మాత్రం ఆ జోన్ పరిధిలో లేదని అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి ఇది కచ్చితంగా ఇచ్చాం అని స్పష్టంగా ఏమీ లేదని, విభజన ఆంధ్రప్రదేశ్ ని ఇలాగేనే చూసేది అని అన్నారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఏం రావాల్సి ఉంది అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. పోలవరాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని, ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించ కూడదు అంటారు, కాని ఇదే పార్లమెంట్ లో చట్టం చేసిన, ఏపి విభజన చట్టం అమలు కాకపోతే, ఇక్కడ కాక ఎక్కడ చెప్పుకుంటాం అని రామ్మోహన్ అన్నారు. ఇక ప్రత్యేక హోదా ఎలా తెస్తారో రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని అన్నారు.