కేంద్రం నుంచి నిధులు పొందడంలో సీఎం జగన్ విఫలం అయ్యారని, టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ, "22మంది ఎంపీలిస్తే కేంద్రం మెడలు వంచుతా అన్నాడు. కేంద్రం మెడలు వంచడం దేవుడెరుగు, సీఎం జగన్ మెడ సగానికి వంగిపోయింది. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా సీఎం జగన్ కేసుల కోసమే.. రాష్ట్రం కోసం పీఎం మోడికి ఇచ్చిన వినతుల కన్నా, కోర్టు వాయిదాలు ఎగ్గొట్టేందుకే ఎక్కువ లేఖలు రాశారు. తన స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. తన కేసుల మీదే ఎంతసేపూ జగన్మోహన్ రెడ్డి ధ్యాస. ఏ విధంగా కేసుల నుంచి బైటపడాలన్నదే జగన్ తపన. రాష్ట్రానికి నిధులు వచ్చినా, రాకున్నా జగన్ కు బేఫికర్. రాష్ట్రాభివృద్ది పట్టదు, పేదల సంక్షేమం గాలికి వదిలేశారు. రోజుకు 18గంటలు ఆలోచనలు సీఎం జగన్ కేసులపైనే. గత 8నెలల్లో జగన్ తుగ్లక్ చర్యలతో కేంద్రం చిన్నచూపు. ఇచ్చిన నిధులు వాడే సామర్ధ్యం లేదు. కొత్తగా నిధులు తెచ్చుకున చొరవ లేదు. జగన్ అవినీతి-అసమర్ధత వల్ల ఏపికి తీరని నష్టం. 5 దేశాల(జర్మనీ,జపాన్,కొరియా,ఫ్రాన్స్,సింగపూర్) ఎంబసీలు హెచ్చరించాయి. కింది కోర్టు నుంచి, పై కోర్టు దాకా అనేక అక్షింతలు. తుగ్లక్ చర్యలతో దేశవిదేశాల్లో నవ్వుల పాలయ్యాం. ఈ బడ్జెట్ లో జగన్ చేతగానితనం మరోసారి బైటపడింది. "
"స్వతంత్రం వచ్చాక ఇంత విఫల ముఖ్యమంత్రిని చూడలేదు. ‘‘ఫెయిల్యూర్ సీఎం’’గా జగన్ రికార్డు సృష్టించారు. రాష్ట్రం ఆదాయం పెంచడంపై ఏనాడూ దృష్టి లేదు. బడుగులు, పేదల సంక్షేమంపై ఆసక్తి లేదు. మోసాలు, నేరాలతో సొంత సంపద పెంచడంలో జగన్ నిష్ణాతుడు.. సమాజంలో సంపద సృష్టించడం చేతకాదు. విభజన చట్టం ప్రకారం ఏపికి రావాల్సింది కూడా తేలేక పోయారు. రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు రాబట్టలేక పోయారు. విశ్వసనీయత లేని సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం. జగన్ పై కేసులు చూసి, ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదు. జగన్ నిర్వాకాలతో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. వైసిపి ప్రభుత్వంతో రాష్ట్రానికి రెండిందాలా నష్టం"
అని అచ్చెన్నాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మాట్లాడుతూ, "ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది జగన్, విజయసాయిరెడ్డిల వైఖరి. 8 నెలల నుంచి మీ కేసుల మాఫీ కోసం, స్వప్రయోజనాల కోసం తప్ప ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడ్డారా? ఏ పని అయినా కేంద్రానికి చెప్పే చేస్తున్నాం, కేంద్రం మన రాష్ట్రాన్ని ఆదుకుంటుందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి ఉందని బడ్జెట్ ముందు వరకు హోరెత్తించారు. తీరా బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ విజయసాయిరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. 22 మంది ఎంపీలను ఉంచుకొని కేంద్రం మెడలు వంచటమంటే ఇదేనా? 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకహోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా రాష్ట్రానికి సంబంధించిందించిన ఒక్క అంశం కూడా లేదంటే అది జగన్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం. ఏపీకి ఒక్కంటే ఒక్కటి కూడా కొత్త రైల్వే ప్రాజెక్టు సాధించలేదు. 13 జిల్లాలకు జీవనాడైనా పోలవరానికి ఒక్క రూపాయి నిధులు రప్పించుకోలేకపోయారు." అని అన్నారు.