పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం మూలంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 41 శాతంగా నిర్ధారించడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా, దక్షిణాది రాష్ట్రాల వాటాలు తగ్గిపోయాయి. గత సంవ త్సరం అంటే 2019-20 వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.305 శాతం ఉండగా పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం మూలంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోకసభలో ప్రతిపాదిచిన 2020-21 వార్షిక బడ్జెట్ లో ఇది 4.111 శాతానికి పడిపో యింది. గత బడ్జెట్ లో ఏ.పికి 4.305 శాతం వాటా కింద 28,242.39 రూపాయలు లభిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ లో 4.111 వాటా కింద 32,287.68 కోట్లు లభించాయి.ఇదే విధంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా కూడా తగ్గిపోయింది. 2019-20 వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు 2.487 శాతం కింద 15,987.59 కోట్ల రూపాయలు లభిస్తే ఈ సంవ త్సరం బడ్జెట్లో 2.188 శాతం వాటా కింద 16,728.58 కోట్లు లభించటం గమనార్హం. కేంద్ర బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాటా శాతం తగ్గినా నిధుల కేటాయింపులో పెరుగుదల ఉన్నది.
గత సంవత్సరం లభించినంత వాటా లభిస్తే రెండు రాష్ట్రాల మొత్తం కేటాయింపులు మరింత పెరిగేవి. ఆంధ్రా వాదా కేంద్ర బడ్జెట్ లో ఏపీ వాటా 4.111 శాతం కింద మొత్తం 32,287.68 కోట్లు లభించాయి. కార్పొరేషన్ పన్నుల రూపంలో 9,916.22 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 9,220.81 కోట్లు, ఆస్తిపన్ను కింద 38 వేలు, కేంద్ర జీఎనీ కింద 9,757.50 కోట్లు, కస్టమ్స్ పన్ను రూపంలో 2012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నుల రూపంలో 1814.66 కోట్లు, సేవా పన్నుల వాటా నుండి 17.19 కోట్ల రూపా యలు లభించాయి. తెలంగాణ వాదా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా.. 2.138 శాతం కింద మొత్తం 16,726.58 కోట్ల రూపాయలు లభించాయి. కార్పొరేషన్ పన్నుల రూపంలో 5,145.05 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 4,788.97 కోట్లు, ఆస్తిపన్ను వాటాగా 17 వేలు, కేంద్ర జి.ఎస్.టి పన్నుల నుంచి 5,062.70 కోట్లు, కస్టమ్స్ పన్నుల రూపంలో 1044 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నుల కింద 682.11 కోట్లు, సేవా పన్నుల కింద 8.92 లక్షలు లభించాయి.
అయితే 15వ ఆర్ధిక సంఘం పై, చంద్రబాబు ఆనాడే ప్రతిఘటించారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఢిల్లీ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని చెప్పారు. 15 ఆర్ధిక సంఘం సిఫార్సుల తో దక్షిణాది రాష్ట్రాలు దెబ్బ తింటాయి అని చెప్పారు. కేరళ, కర్ణాటక తప్ప, తెలంగాణ, తమిళనాడు వినలేదు. తెలంగాణ అయితే, చంద్రబాబుని ఈ విషయంలో విమర్శించింది కూడా. తెలంగాణనే ఎక్కువ నష్టపొయిద్దీ అని లెక్కలేసి మరీ చెప్పినా, మాకేమీ నష్టం రాదు అని .. తెలంగాణ ప్రబుత్వం, చంద్రబాబు పోరాటానికి కలిసి రాలేదు. చంద్రబాబు చెప్పినట్టే ఆంధ్రకంటే తెలంగాణనే ఎక్కువ నష్టపోయింది. తెలంగాణ 2,383 కోట్లు నష్టపోతే, ఆంధ్ర 1521 కోట్లు నష్టపోయింది. అయితే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ మాత్రం, 15వ ఆర్దికసంఘంపేరుతో తెలంగాణకు అన్యాయం చేశారంటున్నారు. నాడు చంద్రబాబు చెప్తే, ఆయన్ను విమర్శించి, ఇప్పుడు మాత్రం లబోదిబో అంటున్నారు.