జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలకంటే బాగా కిల్ ఏపీ పథకాన్ని బాగా ముందుకు తీసుకెళుతున్నాడని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడంతో పాటు, భారత్ ఇమేజ్ ను కూడా తన నిర్ణయాలతో ఆయన దెబ్బతీస్తున్నాడని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాల్ స్ర్టీట్ జర్నల్, రాయిటర్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఇప్పటికే జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించాయని, మీడియాతో పాటు జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఏపీ సీఎం నిర్ణయాలపై తీవ్రంగా ఆందోళన వ్యక్తంచేశాయన్నారు. తాజాగా ఆసియా దేశాలలోనే పేరుగాంచిన ఏషియన్ కమ్యూనిటీ న్యూస్ నెట్ వర్క్ కు కొట్రా (కొరియా ట్రేడ్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ) అధ్యక్షులైన యాంగ్ కిన్ మున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టడం జరిగిందన్నారు. జగన్ చర్యలు, నిర్ణయాల కారణంగా కొరియాకు చెందిన సంస్థలేవీ ఆంధ్రరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలేదని కొట్రా అధ్యక్షులు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

కొరియాదేశంలో పారిశ్రామికవేత్తలకు వేదికైన కొట్రా అధ్యక్షులే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ పరిస్థితి ఎలా తయారైందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ నిర్ణయాలు చూశాక, కొట్రా అధ్యక్షులు కేంద్రానికి కొన్ని సూచనలు చేశారని, ప్రభుత్వాలు మారినప్పడల్లా, విధానాలు, నిర్ణయాలు మారకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఏరాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందులు లేకుండా 15 నుంచి 20ఏళ్లపాటు మార్పులు లేకుండా చూడాలని, దీనికి సంబంధించి కేంద్రమే ఒక కొత్తచట్టం తేవాలని కూడా చెప్పడం జరిగిందన్నారు. కొరియాకు చెందిన అనేక సంస్థలు, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న తరుణంలో, 50 బిలయన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలవల్ల అవన్నీ వెనక్కు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, యాంగ్ కిన్ మున్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. నిజంగా 50 బిలయన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చిఉంటే, లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవన్నారు.

కానీ జగన్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా, దేశమే నష్టపోయే దుస్థితి దాపురించిందని పట్టాభి మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన కియా, ఇప్పటికే చెన్నైవైపు చూస్తోందని, జగన్ నిర్ణయాలకారణంగా కియా తమ ప్లాంట్ ను పొరుగు రాష్ర్టానికి తరలించాలని చూస్తోందని కొట్రా అధ్యక్షులే చెప్పడం జరిగిందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, కేంద్రం తక్షణమే దీనిపై స్పందించి చట్టం చేయకుంటే, కొరియా నుంచే కాకుండా, ప్రపంచంలోని మరే దేశంకూడా భారత్ లో పెట్టుబడులు పెట్టవని యాంగ్ కిన్ మున్ పేర్కొనడం చూస్తుంటే, జగన్ ఎంతటి భయభ్రాంతులతో పాలన సాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చన్నారు. 9నెలల పాలనలో కొన్నివేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని, అందుకు జగన్, విజయసాయి, ఇతర నేతల నిర్ణయాలే కారణమని పట్టాభి స్పష్టంచేశారు. జే-ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు కాబట్టే పారిశ్రామికవేత్తలెవరూ రాష్ట్రంవైపుచూడటం లేదన్నారు.

జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దక్షిణ కొరియా నుంచి దేశానికి రావాల్సిన 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆగిపోతే, ఇతరదేశాలనుంచి ఇంకెన్ని పెట్టుబడులు ఆగిపోయాయే చెప్పాల్సిన పనిలేదన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వనిస్తుంటే, జగన్ మాత్రం భవిష్యత్ లో ఇంకెవరూ దేశంవైపు, రాష్ట్రంవైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నాడని పట్టాభి ఎద్దేవాచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చదువుకునే యువతను మోసపూరితహామీలతో మోసగించిన జగన్, తాజాగా పెట్టుబడులు రాకుండా చేసి వారికి ఉపాధి, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాడన్నారు. ప్రతి విద్యార్థికి రూ.లక్ష వరకు మేలు చేస్తానని తన మేనిఫెస్టోలో చెప్పిన జగన్, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర బకాయిలు ఇవ్వకుండా వారి జీవితాలను నాశనం చేవాడని, దానితో ఆగకుండా రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా చేయడంద్వారా వారిని మరింత దగా చేస్తున్నాడన్నారు. వివిధ దేశాల్లోని ట్రేడ్ ఆర్గనైజేషన్ లన్నీ జగన్ నిర్ణయాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయని, పెట్టుబడులకు రక్షణగా భారత ప్రభుత్వం చట్టాలు చేయాలని కోరే స్థితికి వచ్చాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read