తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. చంద్రబాబును ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆయన వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానాశ్రయం వద్ద వైకాపా కార్యకర్తల తీరుతో ప్రజలు భీతిల్లారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పలుచోట్ల నుంచి కార్యకర్తలను వైకాపా సమీకరించింది. మాజీ సీఎం చంద్రబాబు వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్ ఎదుట బైఠాయించి వైకాపా శ్రేణుల నినాదాలు చేశారు. ఫలితంగా, విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులను వేరే వాహనాల్లో పోలీసులు తరలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజల అవస్థలు పడుతున్నారు.
"వైకాపా కార్యకర్తల నిరసన కారణంగా విశాఖలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెదేపా కార్యకర్తలను విమానాశ్రయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. "విశాఖలో జగన్ భూకబ్జాలు బైటకు వస్తాయనే వైసిపి భయం. అందుకే చంద్రబాబు విశాఖ పర్యటనకు వైసిపి అడ్డంకులు. మాజీ సిఎం చంద్రబాబు కాన్వాయ్ పై వైసిపి దాడికి పాల్పడటం హేయం. ప్రజాస్వామ్యాన్ని ఫాక్షన్ రాజ్యంగా చేస్తారా..? మీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా..? వైసిపి నేతల స్వార్ధానికి పోలీసులను వాడుకోవడం అతిహేయం. ఫాక్షన్ బుద్దులున్నవాళ్లు పాలకులైతే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది తొలినుంచి ఫాక్షన్ బుద్దులే. ఫాక్షన్ కుటుంబం కాబట్టే ప్రత్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలు. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నెలకొల్పారు. వైసిపి ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. "
"టిడిపి ప్రభుత్వం ఇలాగే చేసివుంటే 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవారా..? 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా..? గృహ నిర్బంధాలు టిడిపి నాయకులకేనా..? వైసిపి నేతలకు గృహ నిర్బంధాలు ఉండవా..? గంటల తరబడి మాజీ సిఎంను ఎయిర్ పోర్టు వద్దే నిలిపేస్తారా..? ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలు విసురుతారా..? టిడిపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడతారా..? చోద్యం చూడటానికా పోలీసులు ఉన్నది..? ఏపిలో ప్రభుత్వమే శాంతిభద్రతలను భగ్నం చేస్తోంది." అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే, నాలుగు గంటలుగా వైసీపీ శ్రేణులు, అడ్డుకుంటే, ఇప్పుడు పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటానికి చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.