జర్నలిజం అనే పదానికి అర్ధం మారిపోయి, ఒక దశాబ్దం అవుతుంది. ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే, జర్నలిజం అనాలో, ఏమనాలో కూడా అర్ధం కాని పరిస్థతి. సొంత ఎజండా ప్రజల పై రుద్దుతూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, చూపిస్తూ, ప్రజలను ఏమారుస్తుంది నేటి మీడియా. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి, డబ్బా కొట్టటంలో, పోటీ పడుతూ, డబ్బా కొడుతూ, అధికారంలో ఉన్న వాళ్ళకు చెవులకు ఇంపుగా ఉండేవే వినిపిస్తూ, చూపిస్తూ సాగుతుంది నేటి మీడియా. ఇంకా దరిద్రం ఏమిటి అంటే, రాజకీయ పార్టీలే మీడియా రంగంలోకి అడుగు పెట్టటం, అలాగే పవర్ బ్రోకర్లుగా ఉండే కొంత మంది వ్యాపారవేత్తలు, మీడియా రంగంలోకి అడుగు పెట్టటం. ఇలాంటి వారు జర్నలిస్ట్ విలువలు అనేవి ఏమైనా పాటిస్తారా ? సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నా, అంతా బాగున్నట్టు చెప్తూ, కేవలం భజన చెయ్యటానికే ప్రాధాన్యత ఇస్తుంది నేటి మీడియా. పాలకుల్ని సంతోష పెట్టటం కోసం, ఎంతకైనా దిగజారటానికి, వెనుకాడరు.

trump 2602020 2

అయితే, అమెరికా జర్నలిస్ట్ లు ఇందుకు విరుద్ధం అనే చెప్పే సంఘటన నిన్న ట్రంప్ భారత పర్యటనలో, మన దేశంలోని ప్రజలు చూసారు. వాళ్ళకి ఏమైనా అజెండా ఉందా లేదా అనేది పక్కన పెడితే, సమస్యల పై ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎదురించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. నిన్న ఢిల్లీలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ లో పాల్గున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ మీడియా మొత్తం అక్కడ వాలిపోయి, ట్రంప్ కి ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా, సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్వాదం జరిగింది. విషయం ఏమిటి అంటే, సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా, డోనాల్డ్ ట్రంప్ కు కొన్ని ప్రశ్నలు సందించారు. త్వరలో మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని తిరస్కరిస్తానని ప్రతిజ్ఞ చేయగలరా?

trump 2602020 3

కీలకమైన, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తిని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఎందుకు నియమించాలి అనుకుంటున్నారు అంటూ, ప్రశ్నించటంతో, ట్రంప్ మండి పడ్డారు. నాకు ఏ దేశం సహాయం అవసరం లేదు, తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సీఎన్ఎన్ క్షమాపణ చెప్పింది అంటూ ట్రంప్ ఎదురు దాడి చెయ్యటంతో, ఆ విలేకరి, వాస్తవాలు ప్రసారం చేయడంలో సీఎన్ఎన్ మీకన్నా బాగుంది, మాకు మంచి రికార్డు ఉంది అని చెప్పటంతో, దానికి ట్రంప్ సమాధానం ఇస్తూ, మీది చెత్త రికార్డు అని బదులిచ్చారు. అయితే, మన దేశంలో మాత్రం, ప్రధాని మంత్రి కాని, ముఖ్యమంత్రులు కాని, అసలు మీడియా ముందే రారు. జరుగుతున్న పరిణామాల పై కనీసం స్పందించరు. కాని మన మీడియా మాత్రం భజన చేసే పనిలోనే ఉంటుంది. తప్పో ఉప్పో, మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండాలి, పాలకులని ప్రశ్నించాలి. మన దేశంలో మోడీ, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని, ఇలా ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్ లు, రావాలని కోరుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read