జగన్ అక్రమఆస్తుల పై ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ పై, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫైర్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ కేసు ఆధారం చేసుకుని, తన పై, ఈడీ పెట్టిన కేసును కొట్టేయలంటూ, శ్రీనివాసన్ హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ సందర్భంలో జరిగిన వాదనల్లో, ఈడీ తీవ్రంగా స్పందించింది. హైకోర్ట్ ముందు తమ వాదనలు వినిపించిన ఈడీ, శ్రీనివాసన్ పై ఫైర్ అయ్యింది. అక్రమ ఆస్తుల కేసులో, జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీగా, ఆ కంపెనీకి వైఎస్ చైర్మెన్ గా, ఎండీగా ఉన్న శ్రీనివాసన్, కంపెనీ తీసుకున్న నిర్ణయాలతో సంబంధం లేదు అని ఎలా చెప్తారని, ఆ కంపెనీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి, శ్రీనివాసన్ బాధ్యత తీసుకోవాల్సిందే అంటూ, ఈడీ హైకోర్ట్ ముందు తన వాదనలు వినిపించింది. ఇది మేము చెప్తుంది కాదని, కంపెనీ డైరెక్టర్ లు గా ఉన్నవారు, కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో, బాధ్యత తీసుకోవాలని, ఫెరా చట్టం సహా పలు చట్టాల్లో స్పష్టంగా ఉందంటూ, ఈడీ హైకోర్ట్ కు నివేదించింది.

ed 21022020 2

దీని ప్రకారం, ఇండియా సిమెంట్స్ తీసుకున్న నిర్ణయాలకు, ఆ కంపెనీ ఎండీగా, వైస్ చైర్మెన్ గా, శ్రీనివాసన్ కు సంబంధలేదు అని చెప్పటం, కరెక్ట్ కాదని, ఈడీ చెప్పింది. నష్టాల్లో ఉన్న కంపెనీలకు, అలాగే ఉత్పత్తి ప్రారంభం కాని కంపెనీల్లో, అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టటం చూస్తే, తనకు వైఎస్ ప్రభుత్వం జరిగిన లబ్ది వల్లే, ఈ విధంగా క్విడ్ ప్రోకో లో, ముడుపులు చెల్లించినట్టు అర్ధం అవుతుందని పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధకి చట్టం కింద నమోదైన కేసులో, ఇంకా వాస్తవాలు తెలకొండానే, కోర్ట్ జోక్యం చేసుకోరాదని, ఈ విషయం తేలే దాకా, మినహయింపు ఇవ్వటం కుదరదని , ఈడీ చెప్పింది. శ్రీనివాస వేసిన పిటీషన్ పై, ఈడీ, హైకోర్ట్ సూచన మేరకు, హైకోర్ట్ లో తన కౌంటర్ దాఖలు చేస్తూ, పై విధంగా స్పందించింది.

ed 21022020 3

కడపలో, ఇండియా సిమెంట్స్ కు నిబంధనలకు వ్యతిరేకంగా, 2.60 ఎకరాల లీజుతో పాటు, టి కేటాయింపులు ఇచ్చినందుకు ప్రతి ఫలంగా, ఇండియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లో రూ.40 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ.95.32 కోట్లు, కార్మెల్‌ ఏసియాలో రూ.5 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని, అది కూడా అధిక ప్రీమియం చెల్లించి పెట్టారని, తన సొంత కంపెనీలో పురోగతి లేకోయినా, అదే రంగంలో ఉన్న మరో కంపెనీలో పెట్టటం చూస్తే, ఇది క్విడ్ ప్రోకో అని అర్ధం అవుతందని ఈడీ వాదించింది. దీనిలో భాగంగానే, 2010 మార్చిలో మరో రూ.50 కోట్లు అదే ప్రీమియంతో పెట్టుబడి పెట్టిన రెండు నెలల్లోనే ప్రీమియం సగానికి పడిపోయిన సమయంలో, ఫ్రెంచి కంపెనీ నుంచి ఆకర్షణీయమైన ధర వచ్చిందని, విక్రయించాలంటూ విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన సూచనతో వాటాలు విక్రయించారని ఈడీ పేర్కొంది. శ్రీనివాస్ పెట్టుకున్న పిటీషన్ కొట్టేయాలని కోర్ట్ ను కోరింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read