పచ్చకామెర్ల ఉన్న వ్యక్తికి లోకమంత పచ్చగా కనిపించినట్లు అవినీతి సోమ్ముకు పుట్టిన సాక్షి పత్రికకు, వైసీపీ నాయకులకు ప్రతిది అవినీతిలాగా కనిపిస్తోందని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు ఈఎస్ ఐ ఆసుపత్రుల పరికరాలు, మందుల కోనుగోలు వ్యహారంలో అవినీతి జరిగినట్లు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మండిపడ్డారు. బీసీల ప్రతినిధిగా వారికి జగరుగుతున్న అన్యాయాన్ని, ఆయా వర్గాలకు జగన్ చేస్తున్న తీరనిమోసాలను అచ్చెన్నాయుడు ప్రశ్నించినందుకే ఆయన పై అక్రమ కేసు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. టెలీ హెల్త్ సర్వీసెస్ కార్యక్రమం తెలంగాణలో అమలు ఉండగా.. అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని అచ్చెన్నాయుడు గారు ఒక నోట్ ను సంబంధిత శాఖకు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు.

kollu 21022020 2

బీసీ కార్పోరేషన్ నిధులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టించిన విషయాన్ని అచ్చెంనాయుడు వేలెత్తి చూపించారని ఆయనపై కక్ష పూరితంగానే అక్రమ కేసు పెట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా జగన్ వైఫల్యాలాను ఏలెత్తి చూపుతున్నారని. అందుకే జగన్.. అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేసి.. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న అవినీతి పత్రికలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. ఇందులో భాగంగా 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలలోని ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాయడం జరిగింది.

వీలైనంత త్వరగా ఆయా రాష్ట్రాలలో టెలీ హెల్త్ సర్వీసెస్ ను అమలు చేయాలన్నది ఆ లేఖ ఉద్దేశమని తెలియజేశారు. బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ మంత్రిత్వశాఖ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడానికి నామినేషన్ ద్వారా రూ.1400 కోట్లు ఖర్చు చేశారు. దీనికి పంచాయతీరాజ్ కమిషనర్ లెటర్ నెం. 751 ద్వారా సర్క్యులర్ ఇచ్చారు. ఇందులో సీఎం జగన్ రెడ్డి బొమ్మ గ్రామ సచివాలయాలపైన ముద్రించమని కోరారు. దీనిని హైకోర్టు కూడా తప్పుబట్టింది. వారి బొమ్మలన్నాయి కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకుంటారని వారు అంగీకరిస్తారని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల అభివృద్ధికి అడ్డుపడితే ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read