ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ ప్రత్రికలో, ఇండియన్ నేవీ, విశాఖపట్నంలోని, మిలీనియం టవర్స్ లో, సెక్రటేరియట్ పెట్టటానికి, వీలు లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఒక వార్త వచ్చింది. జాతీయ పత్రికలో రావటంతో, ఇదే వార్తను తెలుగు మీడియా కూడా తీసుకుంది. అయితే, ఈ వార్తల పై ఈస్టరన్ నేవల్ కమాండ్ స్పందించింది. ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మిలీనియం టవర్స్ లో సచివాలయానికి, ఇప్పటి వరకు తాము ఏమి అభ్యంతరం చెప్పలేదని చెప్పింది. అయితే, ఇందులోనే మరో విషయం కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు, ఇలాంటి ప్రతిపాదన ఏమి తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పింది. పత్రికా సారంశం ప్రకారం, తమ వద్దకు సచివాలయం మిలీనియం టవర్స్ లో పెడుతున్నాం అని ఎలాంటి ప్రతిపాదన రాలేదు, దాన్ని మేము తిరస్కరించ లేదు అంటూ, నేవీ తన ప్రెస్ నోట్ లో విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం ఒక వేళ ప్రతిపాదనలు పంపిస్తే, అప్పుడు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

navy 222022020 2

ఉదయం నుంచి వచ్చిన వార్తలు ప్రకారం, ఐఎన్ఎస్ కళింగ కు, దగ్గరగా ఉన్న చోట, మిలీనియం టవర్స్ లో, సచివాలయం నిర్మాణానికి నేవీ అనుమతి ఇవ్వలేదు అని, సచివాలయం అక్కడ వస్తే, రద్దీ ఎక్కువ అవుతుందని, అదే ఐఎన్ఎస్ కళింగ భద్రతకే ముప్పు అని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు నేవీ మాత్రం వార్తలు ఖండించినా, ప్రభుత్వం తమకు మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తున్నాం అంటూ చెప్పలేదు అనే విషయాన్ని కూడా చెప్పింది. మరి ప్రభుత్వం, ఆ ప్రతిపాదన పంపిస్తే, అప్పుడు నవీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. నిజానికి ఇలాంటి దేశ భద్రతకు కీలకమైన చోట, సచివాలయం పెట్టేందుకు, నేవీ అనుమతి ఇస్తుందా, అనేది కూడా చూడాల్సి ఉంది.

navy 222022020 3

అయితే, దీని పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఏపి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపించలేదు అని నేవీ చెప్తుంది కాబట్టి, ఒక వేళా ఏపి ప్రభుత్వం, మిలీనియం టవర్స్ లో సచివాలయం పెట్టుకుంటాం అంటే, నేవీ ఒప్పుకుంటుందా ? ఆ రకమైన చర్చలు లేకపోతే, జాతీయ పత్రికల్లో ఎందుకు కధనాలు వచ్చాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అయితే, మరో పక్క రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుంటున్న వైసీపీ, ఉదయం నుంచి తమ పై బురద చల్లారు అని, ఎల్లో మీడియా అంటూ మరో సారి విరుచుకు పడుతున్నారు. అయితే ఈ ప్రెస్ నోట్ మొదట్లోనే, ఏపి ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన ఇవ్వలేదు అని నేవీ చెప్పిన విషయాన్నీ, మాత్రం పక్కన పెట్టారు. ఈ విషయం ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read