ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి ఫైఓవర్ స్తంభాల పై కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నామం గుర్తును వేయడం వివాదాస్పదంగా మారింది. వారధి పిల్లర్లపై ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణం పూర్తయితే దానిపై వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, ఇది అపచారమంటూ శ్రీవారి భక్తులు, ప్రజాసంఘాలు నిరసన తెలియజేస్తున్నాయి. తిరుపతి నగరంలో స్మార్టుసిటీ కార్పొరేషన్, టిటిడి సంయుక్తంగా గరుడవారధి ఫ్లై ఓవర్ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వారధి నిర్మాణ పనుల్లో తొలుత స్తంభాలు పనులు పూర్తవడంతో స్మార్టుసిటీ అధికారులు శ్రీవారినామాన్ని వేశారు. తొలుత స్తంభాలకు నామం గుర్తువేయడాన్ని తిరుపతి వాసులు, స్వామివారి భక్తులు తప్పుపట్టారు.ఎంతో పవిత్రమైననామంపై వాహనాలు ప్రయాణించడం తప్పని వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో పవిత్రతకు, భక్తికి నిలయంగా వున్న తిరుమలలోని ఆలయ మాడవీదుల్లో కూడా పాదరక్షలు ధరించకుండా టిటిడి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే పవిత్రభావంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు క్రింద నామాలు వుంటే దానిపై వాహనాలు ప్రయాణించడం మంచిది కాదని పలువురు భక్తులు సూచిస్తున్నారు.

అయినా స్మార్టు సిటీ ప్రాజెక్టు అధికారులు వరుసగా పద్మావతిపురం సర్కిల్ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా నంది సర్కిల్ సమీపం వరకు 6 కిలోమీటర్లు దూరంవరకు ఫైఓవర్ లోని స్తంభాలలో 36స్తంభాల వరకుకు నామం అచ్చువేసి రంగులు కూడా దిద్దారు. దీంతో ఈ లోగో కాస్త వివాదాలకు కారణంగా మారింది. సాక్షాత్తు దేవదేవుడు ఆనంద నిలయంలో కొలువై వున్నా శ్రీ వారి భక్తులు నుదుటన ధరించడం తప్ప వాహనాలు రాకపోకలు సాగించే వారధి స్తంభాలకు నామం వేయడమేంటని ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదం కాస్త హిందూ సంప్రదాయాల వరకు వెళ్ళింది. ఏడుకొండలశ్రీవేంకటేశ్వరునికి వైఖానస ఆగమం ప్రకారం జరిగే నిత్యకైంకర్యాల్లో భాగస్వాములయ్యే అర్చకులు రెండు తెగలకు చెందినవారు వున్నారు. వడగలై తెగకు చెందిన ఆర్చకులు యు ఆకారంలో స్వామివారి నామాన్ని ధరిస్తారు. తెంగలై తెగకుచెందిన ఆర్చకులు వై ఆకారంలో నామాన్ని ధరిస్తారు. అయితే వారధి స్తంభాలపై చతు, రస్రాకారంలో శ్రీవారికి ధరింప జేసే నామాన్ని ముద్రించారు.

నామాలపై వాహనాలు వెళ్ళడం తప్పని అంటున్నారు. ఈ నేపధ్యంలో స్తంభాలపై నామాలు వేయాల్సిన అవసరం ఏముందని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అయితే వారధి రీ డిజైనింగ్ అంటూ గతంలోనే టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో శ్రీవారినామానికి బదులు తిరుపతి స్మార్టుసిటీ కార్పొరేషన్ లోగోను స్తంభాలపై వేసి వారధి ప్రారంభం మొదట్లో, చివరన శ్రీవారి నామాలు తీర్చిదిద్దితే మంచిదని పలువురు భక్తులు, ప్రజాసంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నామం గుర్తు ముద్రించి రంగులేయడం వరకు వివాదం కాకుండా మళ్ళీ స్తంభాలపై రీడిజైన్ చేసి సిమెంట్ పాలిష్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. అయితే తిరుపతి నగరంలో ఆటు నిత్యం వస్తున్న 80వేలమంది యాత్రికులకు ఇటు 5లక్షలమంది వుండే తిరుపతి నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గరుడవారధి ఫైఓవర్ పూర్తయితేనే ఊరట కలుగుతుందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read