చంద్రబాబు గత 5 ఏళ్ళ పాలనలో, 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలనలో, ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగం కూడా రాలేదని, గత 5 ఏళ్ళ పాటు, వైసీపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి మీద, పోలవరం మీద ఎలాంటి ప్రచారం, గడిచిన 5 ఏళ్ళలో జరిగిందో, చంద్రబాబు పెట్టుబడులు తేలేదు అంటూ, అదే రకమైన ప్రచారం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తూ, చంద్రబాబు దావోస్ వెళ్ళేది, లేక ఇతర దేశాలకు వెళ్ళేది, విహార యాత్రలకు అంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు సుందర మొఖం చూసి, ఉద్యోగాలు వస్తాయా అంటూ, జగన్ మోహన్ రెడ్డి హేళన చేస్తూ మాట్లాడే వారు. యువతతో మీటింగ్ లు పెట్టి, ఇదే విషయాన్ని వారికి ఎక్కించే వారు. చంద్రబాబు ఒక్క పెట్టుబడి కూడా తేలేదు అని, మేము అధికారంలోకి రాగానే, కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తామని, అప్పుడు పెట్టుబడులే పెట్టుబడులు అంటూ నమ్మించారు. అయితే, ఇక్కడ గత ప్రభుత్వం తప్పు కూడా ఉంది.

చంద్రబాబు హయంలో అనేక కంపెనీలు వచ్చినా, ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నా, వాటిని ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. దీంతో, అదే నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. చివరకు చంద్రబాబు ఎన్నికలు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఎంతో కీలకంగా ఉండే యువ ఓటర్లు చంద్రబాబు వైపు నిలవలేదు. అయితే, ఇప్పుడు తాజగా ఆర్బీఐ ఇచ్చిన ఒక నివేదికలో, వైసీపీ చేసిన ప్రచారం అంతా అబద్ధం అని తేలిపోయింది. ఏకంగా ఆర్బీఐ నివేదిక ఇవ్వటంతో, దీని కంటే ప్రామాణికంగా ఉండేది ఇంకోటి లేదు అనే చెప్పాలి. 2018-19లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దేశంలో పెట్టిన పెట్టుబడుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి, దేశంలోనే ఏపి మొదటి స్థానంలో నిలిచింది.

పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో నిలిచాయి. ఇక గడించిన 5 ఏళ్ళలో, అంటే, 2014 నుంచి 2019 వరకు వచ్చిన పెట్టుబడులు చూస్తే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 2014 నుంచి 2019 వరకు రూ.7,03,103 కోట్ల విలువైన 2,112 ప్రాజెక్టులు, దేశ వ్యాప్తంగా రాగా, 70 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ ఐదేళ్ల కాలంలో, 13.6% వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 13.4% వాటాతో గుజరాత్‌ రెండో స్థానంలో నిలవగా, 10% వాటాతో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రిపోర్ట్ ల్లో ఇంత స్పష్టంగా ఉంటే, వైసీపీ అలా ప్రచారం చేసి నిజం అని నమ్మించింది అంటే, ఇది అప్పటి టిడిపి ప్రభుత్వం వైఫల్యంగానే చెప్పుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read