భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్సీ పొత్తు ఉండదని జనసేనపార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఒకవేళ బిజెపి వైఎస్సార్సీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీతో తాము కలిసివుండేది లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిని కదలించేశక్తి ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. శనివారం ఆయన అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సం దర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ పొత్తులపై వైఎస్సార్సీనేతలు చేస్తున్న వ్యాఖ్యలన్ని ఆబద్దాలేనన్నారు. ఒకవేళ బిజెపితో జగన్ పార్టీ పొత్తు పెట్టు కుంటే అందులో తాను ఉండలేనన్నారు. నాకు తెలిసి బిజెపి అలాంటి పనిచేస్తుందని భావించడం లేదన్నారు. రాజధాని తరలింపు వివాదానికి జగన్ బాధ్యత వహించాల్సి ఉందన్నారు. రాజధాని భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం సరికాదన్నారు. రాజధాని రైతులు తమ భూ ములను నవరత్నాలు పథకం కోసం ఇవ్వలేదన్నారు. రాజధాని అమరావతి పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
రైతులతో రాసుకున్న ఒప్పందంప్రకారం అమరావతే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అన్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి అమరావతిని తీర్చిదిద్దుకున్నాక రాజధాని మార్పు సాధ్యం కాదన్నారు. తనకు అధికారం లేదన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే తమ పార్టీతో ఉన్నాడో లేడో తమకు తెలియదన్నారు. తాను ఓట్లు కోసం, అధికారం కోసం రాలేదన్నారు. అమరావతిలో రైతులపై జరిగినదాడులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జగన్ మొండి పట్టుదలను వదిలి పెట్టాలన్నారు. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుని ఏ ప్రభుత్వం మనుగడ సాధించ లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో భవిష్యత్తు అంధకారం రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్ర ప్రజల భవిష్యత్తు అంథకారం లోకి నెట్టి వేయబడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం తుళ్లూరు మండలంలోని రైతుదీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటించారు.
దీక్షా శిబిరాలను చేరుకొని రైతులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జననేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైన పద్దతికాదన్నారు. అమరావతి రాజధానికి బిజెపి సానుకూలంగా ఉందని చెప్పారు. ఇక్కడ మంచి పంటలు పండే భూములను రైతులు వైఎస్సార్సీ నాయకుల నవరత్నాలకు కాదు త్యాగం చేసిందని, అన్ని కులాల, మతాలవాళ్లు రాజధాని భూములు త్యాగం చేశారన్నారు. వైఎస్సార్సీ ప్రభుత్వానికి టిడిపి నాయకులుమీద కోపం ఉంటే వారిపై చూపించాలని రైతుల మీద కాదన్నారు. రాజధాని ఇష్టారాజ్యంగా మార్చడం తగదని 151మంది ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం తగదని పవన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.