ఈ రోజుల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రోనిక్ మీడియా ఎలా పని చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఎక్కడో ఒకటి, రెండు తప్పితే, అన్ని సంస్థలు, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయటం, వారి అజెండా మాత్రమే ప్రమోట్ చెయ్యటం, ఇలా అయిపొయింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోనే ఇలా ఉంది. అయితే, ఈ ధోరణి ఇక్కడితో ఆగితే పరవాలేదు. ఎందుకంటే, ఒక పార్టీ లైన్ తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాయటం వల్ల, ప్రజలకు ఒరిగింది ఏమి ఉండదు. ప్రజలకు కూడా అర్ధమవుతుంది. కాని, ఫేక్ న్యూస్ రాయటం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ప్రజలను నమ్మిస్తూ, కధనాలు రాయటం,మాత్రం సమాజానికి హానికరమే. కొంత మంది ఆ తప్పుడు వార్త నిజం అని నమ్మినా, అపార నష్టం జరుగుతుంది. కన్ని సార్లు, కొంత మంది మానం, అభిమానం, ఉన్న వ్యక్తులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ సంఘటనలు కూడా చూసాం. ఒక వ్యక్తీ పై, పదే పదే తప్పుడు కధనాలు రాసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, బలవంమరరానికి కూడా వీళ్ళు కారకులు అవుతారు. అయితే, మన రాష్ట్రంలో ఇలాంటి వార్తల వల్ల తెలుగుదేశం బాగా నష్టపోయింది. ఎన్నికల తరువాత కూడా ఇలాంటి వార్తలే వస్తూ ఉండటంతో, ఇక వాటి పై న్యాయ పరంగా వెళ్లేందుకు సిద్ధమవుతుంది.

తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లైంది. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది.

దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read