నిన్నటి నుంచి మండలి చైర్మెన్ పై, ఎలాంటి దాడి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, ఆయన వీడియో వేసి, మండలి చైర్మెన్ వైఖరిని తప్పు బట్టారు. ఇలా అనేక మంది వైసీపీ నేతలు కూడా, ఆయన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. తొత్తులు అన్నారు. అర్హత లేదు అన్నారు. ప్రలోభపెట్టరన్నారు. ఇలా అనేక ఆరోపణలు చేసారు. అయితే, అన్ని ఆరోపణలు చేస్తున్నా మండలి చైర్మెన్ షరీఫ్ ఒక్క మాట కూడా తిరిగి ఎదురు అనలేదు. అయితే, ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారం పై మాత్రం, ఆయన స్పందిస్తూ, వెంటనే ఖండించారు. శాసనమండలిలో, సీఆర్డీయే రద్దు, ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లులను, సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంది. అన్ని మీడియా చానల్స్ లో కూడా ఇది రావటంతో, ఇది నిజమేనెమో అని అందరూ అనుకున్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్లకపొతే, మండలి రద్దు చేస్తే, ఆ బిల్లుని మళ్ళీ అసెంబ్లీకి పంపించి ఆమోదించవచ్చు అనే ఉద్దేశంతో, కొట్న మంది ఇలా ప్రచారం చేస్తున్నారని, టిడిపి ఆరోపించింది.
టిడిపి ఎమ్మెల్సీలు ఈ ప్రచారం పై స్పందిస్తూ, ఇది అవాస్తవం అని చెప్పారు. అయితే, ఈ విషయం పై క్లారిటీ లేకపోవటంతో, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ, మళ్ళీ కన్ఫ్యూషన్ లో పడేయటంతో, మండలి చైర్మెన్, ఈ విషయం పై వెంటనే స్పందించారు. సీఆర్డీయే రద్దు, ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లులు, సెలెక్ట్ కమిటీ వెళ్ళలేదు అనేది అవాస్తవం అని అన్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయిందని ఆయన చెప్పారు. ఇక తరువాత ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. సెలెక్ట్ కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమే మిగిలి ఉందని మండలి చైర్మన్ షరీఫ్ తెలిపారు. సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులు వెళ్ళలేదు అంటూ, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని , చైర్మన్ షరీఫ్ స్పష్టం చేసారు.
చైర్మన్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు, చర్చకు దారి తీసాయి. అసలు ఈ ప్రచారం చేస్తుంది ఎవరూ అనే చర్చ కూడా జరుగుతుంది. బిల్లు ప్రాసెస్ లేట్ అవుతుందని, విచక్షణాధికారాలతో వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతునట్టు, ఆయన ప్రకటన చెయ్యటం, దాని పై వైసీపీ మంత్రులు గోల గోల చెయ్యటం చూసాం. అయినా, సరే ఈ ప్రచారం ఎందుకు చేసారు ? అన్ని మీడియా హౌస్లని ఎందుకు తప్పు దోవ పట్టించారు ? అసలు ఎవరికీ అసవరం అనే చర్చ జరుగుతంది. అయితే ఈ ప్రచారం మొత్తం, అవాస్తవం అని చైర్మెన్ చెప్పారు. శుక్రవారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ షరీఫ్, ఈ వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.