పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లు ఆమోదానికి శాసనమండలిలో ప్రతికూల వరిస్థితులు తలెత్తడంతో భవిష్యత్తు కార్యచరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి ని సారించింది. జగన్ శాసనమండలిలో బిల్లులపై ఎదురైన పరిస్థితులకు దీటుగా స్పందించేందుకు వీలుగా తన మంత్రివర్గ సహచరలు, పార్టీ ముఖ్యకార్యకర్తలతో మంత్రాంగం చేసారు. ఈ విషయంపై ఆయన ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించే అంశంపై పలువురు కీలకమైన సూచనలు చేసారంటున్నారు. ఆయన అక్కడ నుంచే ఇక తన కార్యకలపాలు చవట్టేందుకు సంసిద్ధమయ్యారంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలనే పట్టుదలను ఆయన స్పష్టీకరిస్తున్నారు. ఆయన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర నాద్, బొత్స సత్యనారాయణ, మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ముఖ్యమంత్రి సహచరులు విజయసాయిరెడ్డి, వైవిసుబ్బారెడ్డి తదితరులు ఈ విషయంలో టిడిపి శాసనమండలిలో అనుసరించిన వ్యుహన్ని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారంటున్నారు.
సమావేశంలో మండలిలో చోటు చేసుకున్న పరిణామాలను అనుసరించి కీలక సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు పలువురు న్యాయనివుణలతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలు స్తోంది, న్యాయస్థానాలను ఆశ్రయించి రాజధానుల అంశానికి ఇబ్బంది కలిగించాలని ఇంకా విపక్షం భావిస్తున్న అంశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. శాసనమండలిలో చోటు చేసు కున్న అంశాలకు అనుగుణంగా ఆయన అస్సలు మండలిని రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చారంటున్నారు. మండలిని రద్దు చేయ కుండానే నిర్దిష్ట వ్యవధిని తీసుకుని ఆకర్ష కార్యక్రమం ద్వారా విపక్షం ఎంఎల్సిలను తమ పార్టీలో కలుపుకోవచ్చుననే కొందరి సహ చరుల ప్రతిపాదన పట్ల జగన్ సై అన్నట్టు తెలుస్తుంది.
ఇందులో భాగంగా, కొంత మంది మంత్రులు, నిన్నటి నుంచి, టిడిపి, పీడీఎఫ్ ఎమ్మెల్సీల పై గురి పెట్టారని వార్తలు వస్తున్నాయి. విపక్ష ఎమ్మెల్సీలను, తమ వైపు తిప్పుకుని, మండలిని మరోసారి సమావేశ పరిచి, ప్రస్తుతం ఉన్న మండలి చైర్మెన్ పై, అవిస్వాసం పెట్టి, ఆయన్ను దించేసి, ఆయన స్థానంలో తమకు అనుకూలమైన వారిని పెట్టి, సెలెక్ట్ కమిటీని రద్దు చెయ్యటం కాని, లేక సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వారం, పది రోజుల్లో వచ్చే విధంగా చేయాలని, వైసీపీ ప్లాన్ గా తెలుస్తుంది. అయితే ఈ విధానం వల్ల, జగన్ వైఖరి ప్రజలకు ఎక్ష్పొజ్ అవుతుందని, విపక్షాలకు పోయేది ఏమి ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు కాకపొతే, మూడు నెలలకు అయినా జగన్ అనుకున్నది చేస్తారని, కాకపొతే, ఇప్పటికే టిడిపి ఏమి చెయ్యగలుగుతుంది, ఎలా పోరాడింది అనే విషయం ప్రజలు గమనించారని, ఇప్పుడు జగన్ విపక్ష ఎమ్మెల్సీలను లాగితే, తాను చెప్పిన మాటలకే, తాను వ్యక్తిరేకంగా చేస్తున్నారని, ప్రజలకు అర్ధమవుతుందని, అలా కాకుండా శాసనమండలి రద్దు చేసినా, జగన్ కే నష్టం అని టిడిపి చెప్తుంది.