తనపై ఉన్న కేసులవిచారణ ముంచుకొస్తుండటంతో రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డిలో తత్తరపాటు, కలవరం మొదలయ్యాయని, ఆకంగారులోనే తానేం నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలియని అయోమయావస్థలో ఆయన ఉన్నాడని టీడీపీ సీనియర్‌ నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ముఖ్య మంత్రి అయిన మే30 నుంచి జనవరి 25 (2020)వరకు 30శుక్రవారాలు వస్తే, ఒక్కవారమే జగన్‌ కోర్టుకు హాజరయ్యాడని, ఇకపై తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ందేనని సీబీఐ న్యాయస్థానం స్పష్టంచేయడంతో జగన్‌ హానీమూన్‌ అంకం ముగిసినట్లే నని వర్ల ఎద్దేవాచేశారు. 2012లో జగన్‌ సీబీఐ, ఈడీలు ఛార్జ్‌షీట్లు వేస్తే ఇప్పటివరకు విచారణ సాగుతూనే ఉండటం సుప్రీంఆదేశాలకు విరుద్ధమని వర్ల తెలిపారు. ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలు కేసుల్లో ఉన్నప్పుడు సదరు కేసుల విచారణ ఏడాదిలో పూర్తవ్వాలని, అవసరమైతే రోజువారీ విచారణజరపాలని 2014లో సుప్రీంకో ర్టు స్పష్టంచేసిందని, ఒక్క జగన్‌కేసులవిచారణలో తప్ప, అన్ని కేసుల్లో సుప్రీం ఆదేశాలు అమలయ్యాయని వర్ల పేర్కొన్నారు. ప్రధాని మోదీకూడా నేరచరిత ఉన్న రాజకీయ నేతలపై ఏడాదిలోనే విచారణపూర్తిచేసి వారిని శిక్షిస్తామని చెప్పారన్నారు.

జగన్మోహన్‌రెడ్డి కోర్టులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆయన అనేకకేసుల్లో ముద్దాయినన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడని వర్ల తెలిపారు. కోర్టుకు హాజరవ్వకుండా ఉండటానికే జగన్‌ శుక్రవారం నాడు పనులు పెట్టుకుంటున్నాడన్నారు. అన్నిరకాల అవినీతులకు మూలమైన సీఎం కార్యాలయాన్ని వదిలేసి, ఏసీబీవారు రెవెన్యూకార్యాలయాలపై దాడులుచేస్తే ఉపయోగం ఉండదన్నారు. జగన్‌తోటి ముద్దాయి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలోని బెల్‌గ్రిడ్‌లో పోలీస్‌ నిర్బంధంలో ఉన్నాడని, ఆయన్ని ఆదేశం నుంచి రప్పించడానికి 22మంది వైసీపీఎంపీలు పలుమార్లు కేంద్ర విదేశాంగశాఖా మంత్రి జైశంకర్‌ను, కేంద్రహోంశాఖ కార్యదర్శిని కలిశారని,ఇంతకంటేఘోరం ఇంకెక్కడాఉండబోదని వర్ల అభిప్రాయపడ్డారు. వాన్‌పిక్‌ కేసులో రస్‌అల్‌ఖైమా కంపెనీని మోసగించిన నేరానికి సదరు కంపెనీ ఫిర్యాదుతో ప్రసాద్‌ని నిర్బంధించడం జరిగిందని, గతేడాది జూలై 30న ఆయన్ని సెర్బియాలో నిర్బంధించడం జరిగిందన్నారు. ముఖ్యమ ంత్రి తెలివితేటలన్నీ తనతోటి ముద్దాయిలను విడిపించుకోవడానికి, తనకేసుల విచారణ కు ఎలాంటి లాయర్లను నియమించుకోవాలన్న ఆలోచనలకే సరిపోతున్నాయన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించడానికి వైసీపీఎంపీలు, విజయసాయిరెడ్డిలు పలుమార్లు ఎందుకు కేంద్ర విదేశాంగమంత్రిని ఎందుకుకలిశారనే దానిపై రాష్ట్రప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. నిమ్మగడ్డను భారత్‌కు రప్పించడంకోసం ఇద్దరు తెలుగుహీరోలు కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారన్నారు. జగన్‌కేసుల విషయంలో సీబీఐ ఆరుదేశాల కు లెటర్‌ ఆఫ్‌ రెగోలేటరీ ఇచ్చిందని, మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయాదేశాల్లో జగన్‌ ఏంచేశాడనే వివరాలను సీబీఐకోరిందన్నారు. ఆరుదేశాల నుంచి సమాచారం రానుండటంతో జగన్‌లో తత్తరపాటు, కలవరం అధికమయ్యాయన్నారు. జగన్‌పై సీబీఐ 11ఛార్జ్‌షీట్లు, ఈడీ 5ఛార్జ్‌షీట్లు నమోదు చేసిందని, 120 (బీ) నేరపూరిత కుట్రకుపాల్పడటం, 420 (మోసం చేయడం), 409 (నమ్మకద్రోహం), 477 (అకౌంట్ల తారుమారు) వంటి అనేకనేరాలకు పాల్పడ్డట్లు స్పష్టంచేయడం జరిగిందని వర్ల వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ప్రజలనుంచి కాజేసిన 25వేల ఎకరాలను అప్పగిస్తే, ఆయన జగన్‌కు చెందిన సాక్షిలో రూ.834కోట్లు పెట్టుబడి పెట్టాడన్నారు. నిమ్మగడ్డ దొరికితే తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ఆయన్ని విడిపించడానికి జగన్‌, విజయసాయిరెడ్డిలు కేంద్రమంత్రిచుట్టూ ప్రదక్షిణలు చేశారని వర్ల దుయ్యబట్టారు బినామీ యాక్ట్‌ కింద జగన్‌పై కేసునమోదు చేయాలి.

జగన్‌కు ఉన్న ఆస్తులన్నీ ఆయన బినామీలపేరుతోనే ఉన్నాయని, ఇథోపియా ఇన్‌ఫ్రా, కేప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, హరీశ్‌ఇన్‌ఫ్రాల పేరుతో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ ఉందని, ఆ మూడు జగన్‌ బినామీ కంపెనీలా అని వర్ల నిలదీశారు. అలానే తాడేపల్లిలోని నివాసం, బెంగుళూరులోని ప్యాలెస్‌లు కూడా జగన్‌ తనబినామీల పేరుతోనే ఉంచాడ న్నారు. ఈ విధంగా ప్రజలనుంచి కొట్టేసిన ఆస్తులు, భూములను బినామీలపేరుతో ఉంచి అనుభవిస్తున్న జగన్‌పై కేంద్రం బినామీయాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్‌చేశారు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా జగన్‌ తనఆస్తుల ప్రకటన ఎందుకు చేయడంలేదో సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్‌ పోడియంని చుట్టుముట్టిన టీడీపీ సభ్యుల్ని ఎత్తి బయటపడేయాలన్న ముఖ్యమంత్రి, మండలిలో లారీ ఎక్కినట్లుగా ఛైర్మన్‌బల్లపైకి ఎక్కిన తనమంత్రులను ఏంచేస్తాడో చెప్పాలని వర్ల ప్రశ్నించారు. (అసెంబ్లీలో జగన్‌మాట్లాడినమాటల్ని, మండలిలో మంత్రులుచేసిన వీరంగాన్ని వీడియో రూపంలో వర్ల విలేకరులకు ప్రదర్శించారు.) తన నిర్ణయం (3రాజధానులు) తప్పని జగన్‌కు తెలుసునని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే తత్తరపాటులో భాగంగా తప్పటడుగు లు వేస్తున్నాడన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఉండగా, ప్రజల్ని ఓడించడానికి ఢిల్లీ నుంచి ముకుల్‌రోహత్గీని ఎందుకు తీసుకొచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read