ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, కనీసం చంద్రబాబుకు కూడా మాట్లాడే అవకాసం ఇవ్వరు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగాతి తెలిసిందే. అందుకు కారణంగా, చంద్రబాబు కూడా రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పై గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ లో స్పందించారు. ఈ సందర్భంగా, గత 8 ఏళ్ళుగా, రాష్ట్రానికి, కేంద్రం నుంచి సరైన సహాయం అందటం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ సారి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని, అయితే ఈ సారి కూడా మా ఆశలు వమ్ము చేసారని గల్లా జయదేవ్, కేంద్రం పై ధ్వజమెత్తారు. తరువాత, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే జగన్ మోహన్ రెడ్డి గత 8 నెలలుగా రాష్ట్రంలో సాగిస్తున్న పాలనను దేశం ద్రుష్టికి తీసుకు వచ్చారు.
గత 8 నెలలుగా రాష్ట్రం రివర్స్ లో వెళ్తుందని అన్నారు. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు, జగన్ చేస్తున్న పనులతో మరింత నష్టం జరుగుతుందని గల్లా అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ, నిర్ణయం తీసుకున్నారని, అది మూడు రాజధానులు కాదని, మూడు ముక్కల రాజధాని అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసామని చెప్పారని అన్నారు. అలాగే మ్యాప్ లో కూడా అమరావతిని పెట్టారని గుర్తు చేసారు. విభజన చట్టంలో కూడా, ఒక రాజధానికి సహాయం అని ఉంది కాని, మూడు రాజదానులు అని లేదని గల్లా జయదేవ్ అన్నారు. అలాగే కేంద్రం కూడా గతంలో ఒక రాజధానికి అని చెప్పే, 1500 కోట్లు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసారు.
జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ అని వేసి, గందరగోళ పరుస్తున్నారని అన్నారు. వాటికి అసలు చట్టబద్దత లేదని అన్నారు. ఒక రాజధానికి ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే, మూడు రాజధానులు ఎక్కడ నుంచి ఖర్చు పెడతారు అంటూ గల్లా నిలదీసారు. వివిధ పత్రికల్లో , జాతీయ చానల్స్ లో, జగన్ మోహన్ రెడ్డి ని ఒక తుగ్లక్ అంటూ చెప్తున్నారని అన్నారు. గల్లా ప్రసంగం ఉన్నంత సేపు, వైసీపీ ఎంపీలు, ఆయన ప్రసంగాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం చేసారు. గల్లా ప్రసంగం మొదలు కాగానే, వైసీపీ ఎంపీ మాధవ్ వచ్చి, గల్లా వెనుక బెంచ్ లో కూర్చుని అడ్డు తగులుతూ వచ్చారు. ఈ దశలో పలుసార్లు వైసీపీ సభ్యులు గల్లా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా నందిగం సురేశ్ తదితరులు గల్లా ప్రసంగాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయితే గల్లా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.