2019 ఫిబ్రవరి 27 న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో, విశాఖపట్నం కేంద్రంగా, ప్రధాన కార్యాలయంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు ప్రకటించారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ప్రకటన కేంద్రం నుంచి వచ్చింది. నాలుగైదు నెలల్లో ఈ జోన్ ఉనికిలోకి వస్తుందని అప్పట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు కూడా. కానీ అలాంటిదేమీ ఇప్పటి వరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తాజగా ఇచ్చిన తన బడ్జెట్‌లో కొత్త రైల్వే జోన్ గురించి ప్రస్తావించలేదు. ఇప్పటికే ప్రకటించిన విశాఖ కొత్త జోన్ యొక్క మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేంద్రం చెయ్యలేదు. అంటే విశాఖ జోన్ ప్రకటన అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ఎన్నికల జిమ్మిక్ గానే మారిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. రాష్ట్ర రాజధాని ప్రణాళిక ప్రకారం కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంగా మార్చినట్లయితే, విశాఖపట్నం కోసం ఎక్కువ రైళ్లు అవసరం.

ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఆ అంశంలో ఉపయోగపడుతుంది. కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంటకల్ వంటి మూడు రైల్వే విభాగాలు ఉన్నాయి. ముఖ్యమైన వాల్టెయిర్ విభాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వదిలిపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో, కేంద్రం తన బడ్జెట్ లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం పెట్టక పోవటంతో, మళ్ళీ మొదటికి వచ్చినట్టే అయ్యింది. ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీజేపీ చేసిన హడావిడి అంతా, ఉట్టి మాటలగానే మిగిలి పోయాయి. ఆ రోజు ప్రధాని మోడి కూడా ఎన్నికల ప్రచారంలో ఈ విషయం పై గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత, ఇవన్నీ ఒట్టి మాటలే అని, ఎన్నికల ముందు చేసిన షో అని అర్ధమవుతుంది.

మరో పక్క, విభజన హామీల్లో ఒక్కటి కూడా, ఈ సారి కేంద్ర బడ్జెట్ లో పెట్టలేదు. 22 ఎంపీలతో, కేంద్రం మెడలు వంచి, కేంద్ర బడ్జెట్ నుంచి సాధిస్తాం అని చెప్పిన వైసీపీ, రాష్ట్రానికి తెచ్చింది "గుండు సున్నా". 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజి, పారిశ్రామిక రాయతీలు, పోలవరం, రాజధాని, రెవిన్యూ లోటు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యెక హోదా, జాతీయ విద్యాసంస్థలకు నిధులు ఇలా ఏ విషయంలోనే కేంద్ర బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోగా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా తగ్గిపోయింది. గతంలో 4.305 శాతం ఉండగా, ఇప్పుడు 4.111 శాతం అయ్యింది. దీని వల్ల, రాష్ట్రం రూ.1,521.30 కోట్లకు పైగా నష్ట పోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read