ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. తొలుత రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ.. కేంద్రం విస్పష్టమైన ప్రకటనతో తాజాగా వ్యూహాన్ని మార్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఈ నెల 10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు పార్టీ ప్రముఖులు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలుసహా రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో వీరు చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అమరావతి రాజధాని తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ గతంలోనే రాజకీయ తీర్మానం చేసింది. అంతకు ముందు పలుమార్లుకన్నా లక్ష్మీనారా యణ, సుజనా చౌదరి, పురంధేశ్వరి సహా పలువురు బీజేపీ నేతలు రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. నేతల పర్యటనల్లో రైతుల నుంచివ్యక్తమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తరలింపుపై రాజకీయంగా తీర్మానం చేశారు.

కేంద్ర బీజేపీ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రాజధాని మార్పుపై రాష్ట్రప్ర భుత్వం వెనక్కి వెళ్లే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు పలుప్రయత్నాలు చేశారు. ఇలాంటి తరుణంలో పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయం రాష్ట్రప భుత్వ పరిధిలోని దంటూ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన బీజేపీ నేతలను సైతం గందరగోళానికి గురి చేసింది. ఈ క్రమంలోనే తొలుత 10న రాజధాని గ్రామాల్లో పర్యటిం చేందుకు ఆలోచన చేశారు. అయితే ముందు పార్టీ అధిష్టానం వద్ద చర్చించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే హామీ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తొలుత కన్నా సహా కీలక నేతలు ముందు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళుతున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఎదుకు చూస్తున్న అధ్యక్ష నియామకంపై ఇదే పర్యాటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గత నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక జరగాల్సి ఉంది. అయితే జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా గత నెల 20న బాధ్యతలు చేపట్టడంతో జాప్యం జరిగింది. నెలాఖరుకు రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేస్తారని భావించినప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈ నెల 11 లేదా 12న రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. కొత్త అధ్యక్షుని ఎంపిక వ్యవహారం ముగిసిన తర్వాత అమరావతి రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే యోచనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read