ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో రంగుల పనులు ఎంత బాగా నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఊరిలో ఉన్న పంచాయతీ భవనానికి, వైసీపీ పోలిన రంగులు వెయ్యమని, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక అధికారి ఇచ్చిన మెమోతో, రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ ప్రతి వార్డులోని భవనాలు వైసీపీ రంగులతో నింపేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతి పంచాయతీ ఆఫీస్ కు జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా ముందు బోర్డు మీద తగలించారు. ఒక్క పంచాయతీ ఆఫీస్ మాత్రమే కాదు, వాటర్ ట్యాంకులకు కూడా ఇదే పరిస్థితి. ప్రతి ప్రభుత్వ భవనానికి, ఇదే పరిస్థితి వచ్చింది. అయితే, కొంత మంది మరీ ఉత్సాహం ఎక్కువ ఉన్న వారు, కనిపించిన ప్రతి దానికి వైసీపీ రంగులు వెయ్యటం మొదలు పెట్టరు, బోరింగ్ పంపు, గద్దర్లు, పూల కుండీలు, ఆకులు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది కనిపిస్తే అది రంగులతో నింపేశారు. అయితే, ఈ రంగుల పిచ్చ పై, చిరాకు పుట్టిన ఒక సామాజిక కార్యకర్త, గుంటూరుకు చెందిన వ్యక్తీ, హైకోర్ట్ లో ఒక పంచాయతీ విషయం పై, కోర్ట్ లో కేసు వేసారు.
పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగుల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీరును ఆక్షేపించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే హైకోర్ట్ సీరియస్ అవ్వటంతో, పంచాయతీకి వేసిన రంగులు వైసీపీ ర్టీ రంగులు వేర్వేరని ప్రభుత్వ లాయర్ హైకోర్ట్ కు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చసారు. దీని పై హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. హైకోర్ట్ వేసిన ప్రశ్నలకు ప్రభుత్వ లాయర్ అవాక్కయ్యారు. రంగులను మేము గుర్తుపట్టగలమన్న న్యాయమూర్తి, పార్టీ జెండా, గుర్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు. ఇక అలాగే, పంచాయతీ ఆఫీస్ లమీద సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని జడ్జి, ప్రభుత్వ తరపున వచ్చిన లాయర్ ని ప్రశ్నించారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ముద్రించినట్టు లాయర్.. వెల్లడించారు. అయితే, దీని పై కూడా లాయర్ మీద మండి పడ్డారు న్యాయమూర్తి. పార్లమెంట్ మీద మోడీ, సుప్రీం కోర్టు మీద సీజేఐ ఫోటో ముద్రించారా అని న్యాయమూర్తి ప్రశ్నలు వెయ్యటంతో, ప్రభుత్వ లాయర్ అవాక్కయ్యారు. ఈ సంప్రదాయం ఎక్కడుందో చూపాలన్న న్యాయమూర్తి అడగటంతో, అవాక్కయ్యారు. ఇక్కడతో కేసు రేపటికి వాయిదా పడింది. ఈ విషయం పై కోర్ట్ రేపు ఏమి స్పందిస్తుందో చూడాలి. ఒక పక్క స్థానిక ఎన్నికలు వస్తున్న తరుణంలో, ఎన్నికలు ఎక్కువగా పంచాయతీ ఆఫీస్ లలోనే జరుగుతాయి. ఇక్కడ ఒక పార్టీ రంగులు వెయ్యటం, అలాగే జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండటం, ఇవన్నీ ఎన్నికల కోడ్ కిందకు వస్తాయి. అన్నీ తెలిసినా, ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో మరి.