మూడు ముక్కల రాజధాని విషయంలో, జగన్ ప్రభుత్వం, ఎవరి మాట వినకుండా దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 40 రోజుల్లోనే ప్రక్రియ అంతా ముగించాలని ప్లాన్ చేసారు. అయితే వీరి దూకుడికి శాసనమండలి బ్రేక్ వేసింది. జగన్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రెండు బిల్లులను, శాసనమండలి బ్రేక్ పడేలా చేసింది. సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకోవటంతో, ప్రక్రియ మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాసం ఉంది. అయితే, ఈ విషయాన్నీ జగన్ తట్టుకోలేక పోయారు. తన నిర్ణయానికే వ్యతిరేకంగా చెప్పిన మండలిని ఉంచటానికి వీలు లేదు అంటూ, మండలి రద్దు తీర్మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, కేంద్రానికి పమించే ఏర్పాటు చేసారు. దీంతో, కౌన్సిల్ రద్దు గురించి వైయస్ఆర్ కాంగ్రెస్ లో చర్చను ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మూడు రాజధానుల ప్రణాళికను కౌన్సిల్ ఎలా నిలిపివేసిందనే దాని పై చాలా కోపంగా ఉన్నారని, ఆయన ప్రతీకారం తీర్చుకుంటే, ఇలా ఉంటుందని, దాని వల్ల, సొంత పార్టీ కూడా నష్టపోతుంది అని అంటున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు సహనంగా ఉండి ఉంటే, అప్పటికి మొత్తం కౌన్సిల్ ఆధిపత్యం చెలాయించే, స్తానంలో వైసీపీ ఉండేదని అంటున్నారు. కౌన్సిల్ రద్దు, కేంద్రం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే, ఇద్దరు మంత్రులు - పిల్లి సుబాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకట రమణ తమ సీట్లను ఖాళీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా, వైయస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఆశావాదుల జాబితా చాలా పెద్దగా ఉంది. మొన్న ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ సందర్భంగా, జగన్ అనేక మంది నాయకులకు MLC వాగ్దానాలు చేసారు. అయితే ఇప్పుడు వారికిఎమ్మెల్సీ పదవి లేకుండా పోతుంది.

జగన్ ఇప్పుడు దానిని విస్మరించి, ప్రాంతీయ మండల్లిలో, ఎమ్మెల్సీ హోదాతోనే ఇస్తాం అంటున్నా, ఎవరూ ఇష్ట పడటం లేదు. వచ్చే ఎన్నికల సమయంలో దీని దెబ్బ జగన్ కు గట్టిగా తగిలే అవకాసం ఉంది. అయితే ఇదే విషయం పై, చంద్రబాబుని కొంత మంది అడగుతూ, ఈ నిర్ణయం మీకే ఎక్కువ నష్టం కదా అని అడగగా, కౌన్సిల్‌లో 29 మంది సభ్యులను కలిగి ఉన్న టిడిపికి ఇప్పుడు తాత్కాలిక నష్టం జరగవచ్చు, కాని మా మెజారిటీ ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో కోల్పోతుండటంతో, మాకు పెద్దగా ఆందోళన లేదు, ప్రజల కోసం పదవులు నష్ట పోతున్నాం అనే సంతోషం ఉంది, అమరావతి రైతుల కోసం, 29 మంది పదవులు త్యాగం చేసారు అంటూ చంద్రబాబు చెప్పారు. మండలి రద్దు అవ్వాలంటే ఏడాది పైన పడుతుంది. సరిగ్గా వైసీపీకి మెజారిటీ వస్తుంది అనే టైంకి, రద్దు అవుతుంది. జగన్ తనకు ఉన్న అహంతో, తానే తన పార్టీని నష్ట పరుచుకున్నారు అంటూ, చంద్రబాబు వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read