కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడుకు తరలిపోతుంది అంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల పై, చంద్రబాబు ఈ రోజు విలేఖరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "ఈ రోజు రాయి టర్స్ లో కియా మోటార్స్ పై స్టోరీ వచ్చింది. ఆర్ధిక అంశాలపై గ్లోబల్ గా క్రెడిబిలిటి ఉన్న మీడియా. ఈ ఆర్టికల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కియా వాళ్లు తరలింపుపై పక్కరాష్ట్రంతో చర్చిస్తున్నట్లు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ ప్రతినిధులే చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా, 5వ అతిపెద్ద కార్ల తయారీ పరిశ్రమ, రూ 13,500కోట్ల పెట్టుబడి, 18వేలమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ. ఏడాదికి 3లక్షల కార్ల తయారీ లక్ష్యంగా ఉన్న పరిశ్రమ. కియా ఏపికి రావడంపై కన్నన్ రామస్వామి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. "తమిళనాడును మొదటి చాయిస్ గా చూశాం, గుజరాత్ ను రెండో చాయిస్ గా చూశాం, 3వ చాయిస్ గా ఏపిలో శ్రీ సిటీ సెజ్ అనుకున్నాం. తమిళనాడు నాయకులు కంపెనీకి ఇచ్చే భూమి విలువకు 50రెట్లు లంచంగా అడిగారు. దీనితో కియా ఏపికి తరలిపోవాలని నిర్ణయించింది. అనంతను ఎంపిక చేయించడంలో సీఎం చంద్రబాబు కష్టం ఎంతో ఉంది. ఎన్నో రాయితీలు ఇచ్చారు. కియా ఏపికి వెళ్లడం వల్ల తమిళనాడు 110కోట్ల డాలర్ల పెట్టుబడులను కోల్పోయింది. అనుబంధ పరిశ్రమలూ పోయాయి, ఉద్యోగాలు పోయాయి: కన్నన్ రామస్వామి, తమిళనాడు పారిశ్రామిక వేత్త."
‘‘ఏపిలో కియా పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది. ఎంవోయూపై సంతకాలు చేసిన దగ్గరనుంచి సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు నీరు,విద్యుత్ కల్పించారు. చంద్రబాబు మద్ధతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యం అయ్యేది కాదు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి ధన్యవాదాలు’’: హన్ వూ పార్క్,సిఈవో,కియా మోటార్స్... మా ప్లాంట్ ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది. సీఎం నుంచి కిందిస్థాయి వరకు అధికార యంత్రాంగం సహకారం వల్లే అనుకున్న సమయం కన్నా ముందే నిర్మాణం పూర్తి అయ్యింది. ఏపిలో విద్యావంతులైన తెలివైన యువత ఉన్నారు. వారికి తోడుగా అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఏపికి ఉన్నారు. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నాం: మనోహర్ భట్, కియా మార్కెటింగ్ హెడ్"
కియా ఏర్పాటుకు చేసిన శ్రమను సోదాహరణంగా వివరించారు. కొరియాకు వెళ్లడం, వాళ్లు ఇక్కడికి రావడం తేదీల వారీగా పేర్కొన్నారు. "కియా ఆషామాషీగా ఏపికి రాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తే కియా వచ్చింది. అనంతపురంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని మనం కోరాం. ఆ ప్రాంతంలో నీటి కొరత గురించి ప్రస్తావించారు. శరవేగంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం, దానికి నీళ్లిచ్చి అక్కడనుంచి కియాకు నీళ్లిచ్చాం. 2నెలల్లో భూమి చదును చేయించి పరిశ్రమ ఏర్పాటుకు సిద్దం చేశాం. కియా వల్ల రూ 20వేల కోట్ల భారం అని ఒక మంత్రి చెబుతారు. ప్రోత్సాహకాలు ఇవ్వం, కియా మళ్లీ సమీక్షిస్తాం అని బెదిరిస్తారు. చైనాలో కియా ప్లాంట్ మూతపడితే 6వేల ఉద్యోగాలు పోయాయి. అనంతపురంలో కియా సంగతేంటి..? ఇక్కడ ఉద్యోగాల సంగతేంటి అని సాక్షిలో అనుమానాలు సృష్టిస్తారు. భూములు ఇవ్వవద్దు, సహాయ నిరాకరణ చేయమని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టారు. కానీ అక్కడి రైతులు విజ్ఞులు కాబట్టి కియా ఏర్పాటుకు సహకరించారు. తుపాకి చూపినట్లు వేలి చూపి వైసిపి ఎంపి మాధవ్ బెదిరిస్తే ఎవరన్నా వస్తారా ఏపికి..? ఈ భూమి మాది, నీళ్లుమావి, ఉద్యోగాలు మావే అని తలకు వేలి చూపి బెదిరిస్తారు. మేము చెప్పినట్లు చేయాల్సిందే, లేకపోతే ఇక్కడ వ్యాపారం చేయలేరని ఇంకో నాయకుడు బెదిరిస్తారు."
"అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ తరలింపును తమిళనాడు అధికారులు ధృవీకరించారు. కియా వాళ్లను బెదిరించారు మేము చెప్పినవాళ్లకే ఉద్యోగాలు కావాలని..మీరు కియాను బెదిరించడం అవాస్తవమా..? మీ మంత్రి, మీ ఎంపి కియా వాళ్లను బెదిరించలేదా..? నంగినంగిగా బుగ్గన మాట్లాడటం కాదు. కథలు చెప్పడం కాదు మంత్రి బుగ్గన. ఆ రోజు కూడా వోక్స్ వ్యాగన్ ను పూణేకు తరిమేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడి వోక్స్ వ్యాగన్ పోగొట్టారు. వీళ్ల చర్యల వల్ల పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేంద్రమంత్రి లేఖ రాసినా నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడి తేవడం చాలా కష్టం, కంపెనీ ఏర్పాటు చేయడం చాలా కష్టం. పారిశ్రామిక రంగంపై మొన్న ఇచ్చిన శ్వేతపత్రంలో చెప్పిందానికి, ఈ రోజు మంత్రి బుగ్గన చెప్పిందానికి పొంతన లేదు. శ్వేతపత్రం పేజి 13లో రూ 2,800కోట్ల ఇన్సెంటివ్ బకాయిలు అన్నారు. ఈ రోజు రూ 3,500కోట్ల బకాయిలని బుగ్గన అంటారు."
"అన్నీ అబద్దాలే మంత్రి బుగ్గన మాట్లాడేది.. 2014జూన్ నుంచి 2019మార్చి వరకు రూ3,675కోట్లు ఇన్సెంటివ్ లు టిడిపి ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే చెప్పారు. ఒక్క సెప్టెంబర్ లో 8సార్లు ఓడికి వెళ్లారు. మేము ఒక్కసారి ఓడికి వెళ్లలేదని అబద్దాలు ఆడతారు. ఈ 8నెలల్లోనే రెవిన్యూ వసూళ్లు 13% తగ్గాయి, రెవిన్యూ ఎక్స్ పెండిచర్ సగానికి పడిపోయింది. కేపిటల్ ఎక్స్ పెండిచర్ పూర్తిగా అడుగంటింది(కేవలం 18%మాత్రమే). రాష్ట్రానికి వచ్చేవి రూ లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు పోగొట్టారు. అదాని డేటా సెంటర్ రూ 70వేల కోట్లు, లులూ కన్వెన్షన్ సెంటర్ రూ 3వేల కోట్లు, ఆసియా పేపర్ మిల్స్ రూ 25వేల కోట్లు, సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్స్ రూ 50వేల కోట్లు, 130సంస్థలకు ఇచ్చిన భూముల్లో వచ్చే రూ 45వేల కోట్లు పెట్టుబడులు అన్నీ పోగొట్టారు." అంటూ చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పారు.