ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. బుధవారం పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమాధానాన్ని తెలుగుదేశం పార్టీ వక్రీకరిస్తూ భ్రమల్లో విహరిస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతినే రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటూ తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా నోటిఫై చేశారని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఇకపై మరో కొత్త జీవో ఏదైనా వస్తే కేంద్రం ఆ జీవోను కూడా ప్రస్తావిస్తుందని వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జారీ చేసిన జీవో మార్చడానికి శిలా శాసనం కాదని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

కేంద్ర అంత స్ప ష్టతనిచ్చినా భ్రమలు కల్పించే రాజకీయాలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీని విమర్శించారు. కొత్త ప్రభుత్వం కొత్త రాజధానిపై జీవో జారీ చేస్తే దాన్ని కూడా కేంద్ర గుర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయాన్నీ రాజకీయ కోణంలో చూడదని, రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రానికే పరిమితమైన అంశమని చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమేర వ్యతిరేకిస్తోందనిజీ వీఎల్ నరసింహా రావు అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదట డిమాండ్ చేసింది. బీజేపీయేనని, ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు నిర్ణయం వరకు స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక మిగతా పాలనా విభాగాలను విశాఖపట్నం తరలించి, అమరావతిని కేవలం అసెంబ్లీకి పరిమితం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇలా చేస్తే అమరావతిని రాజధానిగా కొనసాగించినట్టు కాదని అన్నారు.

ఇది ఇలా ఉంటే జీవీఎల్ తీరు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏపి బీజేపీ మొత్తం ఒక వైపు ఉంటే, జీవీఎల్ మాత్రం ఒక వైపు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని రైతులు, బీజేపీ వైపు ఆశగా చుస్తున్న ప్రతి సారి, జీవీఎల్ వచ్చి, వైసీపీ అధికార ప్రతినిధిలాగా, వైసీపీ ఎజెండా తీసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అమరావతి పై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కూడా, జీవీఎల్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. ఆయనకు అమరావతి మీద ద్వేషమో, లేక చంద్రబాబు మీద ద్వేషమో కాని, ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలి అనుకుంటున్న బీజేపీ ప్రయత్నాలకు మొదటి శత్రువు మాత్రం, జీవీఎల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ, జీవీఎల్ ని కట్టడి చెయ్యాలని, ఏపి బీజేపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read