ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోందని, చైనాలో వేలాదిమంది వైరస్‌బారిన పడ్డారని, ఆదేశంలో అనధికారికంగా 10వేలమంది వరకు చనిపోయారని, మిగిలిన దేశాలు, రాష్ట్రాలు వైరస్‌పై ప్రజలకు అవగాహనకల్పిస్తూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి జగన్‌మాత్రం కరోనావైరస్‌కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖతో, ఇతరఅనుబంధశాఖలతో ఒక్కటంటే ఒక్క సమీక్షాసమావేశం కూడా నిర్వహించకపోవడం విచారకరమని టీడీపీనేత, ఆపార్టీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వాపోయారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయ ంలో విలేకరులతో మాట్లాడారు. కరోనావ్యాప్తిపై జిల్లాకలెక్టర్లతో, వైద్య, ఇతరశాఖల సిబ్బందితో సమీక్షలు నిర్వహించకుండా, రాష్ట్రంలో నమోదైన కరోనాకేసులను విచారిం చకుండా, తనస్వార్థప్రయోజనాలకోసమే జగన్ పాకులాడుతున్నాడని పట్టాభి మండిపడ్డా రు. చైనాలో చిక్కుకున్న తెలుగువిద్యార్థులు, ఉద్యోగులను తక్షణమే వారివారి స్వస్థలాలకు తరలించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు జనవరి 31న కేంద్రవిదేశాంగమంత్రికి లేఖరాస్తే, బాధ్యతగల ముఖ్యమంత్రిపదవిలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి, కనీసం లేఖకూడారాయకపోవడం బాధాకరమన్నారు.
స్వదేశంలో, స్వరాష్ట్రంలో ఉన్న వారిని జగన్ ఎలాగూ పట్టించుకోవడంలేదని, కనీసం విదేశాల్లో ఉన్నవారి గురించికూడా పట్టించుకోకపోతే ఎలాగని పట్టాభి నిలదీశారు. నిఫావైరస్ 2018లో దేశంలోకి ప్రవేశించినప్పుడు, జిల్లాలవారీగా చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించి అన్నిరకాలుగా ముందుజాగ్రత్తలు తీసుకొని రాష్ట్రం నిఫాబారినపడకుండా చర్యలు తీసుకున్నారని పట్టాభి తెలిపారు. కాకినాడలో కరోనావ్యాపించడంతో ప్రభుత్వా సుపత్రి వైద్యులు భయంతో విధులకు వెళ్లడంమానేశారని, అయినా ప్రభుత్వంలో చలనంలేదన్నారు. జగన్ ముఖ్యమం త్రయ్యాక డెంగ్యూబారినపడి అనేకమంది మరణించినా, దోమలనిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాననగరాల విమానాశ్రయాల్లో కరోనాను గుర్తించే స్కానర్లు, పరికరాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని, ఆవైరస్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే, జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
డెంగ్యూ విషయంలో మాదిరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుందని, దానివల్ల ప్రాణనష్టం తప్పదని పట్టాభి హెచ్చరించారు. జగన్ ఇప్పటికైనా తనమొద్దునిద్రను వీడి, చంద్రబాబు మాదిరే అత్యవసరంగా సమీక్షలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించి, అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్‌చేశారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేపరికరాలు, స్కానర్లు ఏర్పాటుచేసి, వ్యాధిలక్షణాలున్న వారికి అత్యవసర వైద్యసేవలు అందించాలని టీడీపీనేత సూచించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న జగన్‌సర్కారు తక్షణమే స్పందించి, కరోనావ్యాప్తికి అడ్డుకట్టవేసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్‌చేశారు.