ఆంధ్రప్రదేశ్ లో "ధికారిక అరాచకానికి" ఇది ఉదాహరణ... ఈ వ్యాఖ్యలు చేసింది, సామాన్య ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ఈ రాష్ట్ర హైకోర్ట్. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పటానికి, ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగటం, వేరే పార్టీ వచ్చిన తరువాత, సహజంగా కొన్ని రోజులు ఉద్రిక్త పరిస్థితిలు, కక్ష సాధింపులు ఉంటాయి. కాని అవి తీవ్ర రూపం దాల్చితే, రాష్ట్ర ఇమేజ్ కే ప్రమాదం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. తమ కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ చెప్పింది. తెలుగుదేశం పార్టీ సానుభితిపరులు, అనుకుంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పీకేస్తున్నారు అని చెప్పింది. తెలుగుదేశం సానుభూతి పరులు అనుకుంటే, వారి రేషన్ డీలర్ షిప్ కట్ చేస్తున్నారు అని చెప్పింది. అలాగే ఉపాధి హామీ బిల్లులు, వివిధ పనుల బిల్లులు చెల్లింపులు కూడా. అయితే అన్నిటికీ ఆధారాలు ఉండవు కాబట్టి, కోర్ట్ మెట్లు ఎక్కే వీలు ఉండదు.
అయితే ఒక రేషన్ డీలర్ విషయంలో, ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాసిన లేఖ తమకు అందటంతో, హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఈ రేషన్ షాపుని రద్దు చేసి, నేను సూచించిన వారికి మాత్రమే ఇవ్వండి అంటూ, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి రాసిన లేఖ, ఆ లేఖ అనుగుణంగా, అమలు చేసిన అధికారి పై, హైకోర్ట్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఉప ముఖ్యమంత్రి చెప్పిన విధంగా చేసిన, జాయింట్ కలెక్టర్‌ది అనాలోచిన చర్య అంటూ, హైకోర్ట్ వ్యాఖ్యానించింది. అధికారిక అరాచకానికి, ఈ చర్య ఒక ఉదాహరణ అంటూ, తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో పాటుగా, వెంటనే, సదరు రేషన్ షాపు డీలర్‌కు అనుమతిని వెంటనే పునరుద్ధరించాలని హైకోర్ట్, తీర్పు ఇచ్చింది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెదకంటిపల్లిలో పి.మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్ షాపు అనుమతిని, పోయిన ఏడాది డిసెంబరు 2న, అక్కడ జాయింట్ కలెక్టర్ రద్దు చేశారు. మీ రేషన్ షాపు నిర్వహణలో లోపాలు ఉన్నాయి అని, అక్టోబరు 29న నోటీసు ఇచ్చారు. వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా, రేషన్ షాపు రద్దు చేసారు. దీంతో ఆమె, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రాసిన లేఖతో పాటుగా, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని, కోర్ట్ కు వెళ్లారు. కనీసం ఆమె రేషన్ షాపులో తనిఖీ కూడా చెయ్యలేదని, కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీని పై స్పందించిన కోర్ట్, డీలర్ ను తొలగించటానికి ఒక పద్దతి ఉంటుందని, ఉపముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకూడదని, ఇవన్నీ ‘అధికార అరాచకం’గా చెప్తూ, కోర్ట్ ఆ రేషన్ షాపుని, పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది.