ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది ఎప్పుడో సెటిల్ అయిపోయిన ఇష్యూ. అయితే జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ముక్క సెక్రటేరియట్ ను వైజాగ్ లో పెడుతున్నాం అని, మరో ముక్క హైకోర్ట్ ని కర్నూల్ లో పెడుతున్నాం అని, అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకుంటుందా అని ఏపి ప్రజలు ఎదురు చూస్తున్న వేళ, ఈ రోజు కేంద్రం పార్లమెంట్ లో ఈ విషయం పై స్పందించింది. ఏపి రాజధాని పై ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నలు అడిగారు. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు రాజధానులుగా చేస్తున్నారు, మీకు తెలుసా ? దీని పై గవర్నమెంట్ అఫ్ ఇండియా అభిప్రాయం ఏమిటి ? ఏపి ప్రభుత్వాన్ని ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, తీసుకుంటే, రాష్ట్రం వెనక్కు వెళ్ళిపోతుంది, పెట్టుబడులు రావు, అలాగే భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతారు అని, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించవచ్చు కదా అని గల్లా జయదేవ్ ప్రశ్న వేసి అడిగారు.

దీని పై, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2015లో నోటిఫై చేశారని, ఆయన గుర్తు చేసారు. అలాగే ప్రస్తుతం, మూడు రాజధానుల విషయం పై, తాము మీడియాలో వస్తున్న రిపోర్ట్ లు చూస్తున్నాం అని అన్నారు. ఇక రాష్ట్రాల్లో రాజధాని విషయం అనేది, రాష్ట్రాలకు సంబంధించిన విషయం అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే, కేంద్రం కూడా అమరావతికి జరుగుతున్న అన్యాయం పై మేము ఏమి చెయ్యలేం అనే విషయం చెప్పిందా అనే విషయం అర్ధమవుతుంది. ఇంత గందరగగోళం రాష్ట్రంలో ఉన్నా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. అయితే ఇక్కడ అమరావతిని నోటిఫై చేసారా, గజెట్ ఇచ్చారా అని అడుగుతున్న మంత్రులకు మాత్రం, ఈ రోజు సమాధానం దొరికింది. వారి మాటలు అబద్దం అని తేలిపోయింది.

ఇక పొతే, ఈ రోజు గల్లా జయదేవ్, అమరావతిలో రైతుల పై, మహిళల పై, తన పై జరిగిన దాడి విషయాలను పార్లమెంట్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. అధికారం ఉంది కదా అని, అమరావతిలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. అకారణంగా 1-4-4 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చలో అసెంబ్లీ అని రైతులు, మహిళలు పిలుపు ఇస్తే, ఆ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గున్న తనను, పోలీసులు వేధించారని అన్నారు. తనను చొక్కా చించి మరీ గాయపరిచారని అన్నారు. తనను అరెస్ట్ చేసి 13 గంటలు, అరెస్ట్ చూపించకుండా అటు ఇటూ తిప్పారని, చివరకు 13 గంటల తరువాత, జడ్జి ముందు హాజరు పరిచారని అన్నారు. అమరావతిలో 49 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గల్లా సభ దృష్తికి తీసుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read