ఈ రోజుల్లో ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఇలా ఎవరికి తోచిన వారు, కధనాలు వేస్తూ ఉంటారు. తమకంటూ ఒక అజెండా పెట్టుకుని, ఆ అజెండా ప్రకారమే ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ వార్త నిజమా, అబద్ధామా అనేది అనవసరం. తమకు మైండ్ లో వచ్చిన విషయాన్ని, ఒక వార్త లాగా రాసి, జనాల మీదకు తోసేయటమే. ఇది వరకు, ఎవరి పైన అయనా వార్త వెయ్యాలి అంటే, ఆయనకు ఫోన్ చేసి కాని, కలిసి కానీ, మీ మీద ఈ వార్త వచ్చింది, నిజమా, కాదా, మీ అభిప్రాయం చెప్పండి అనే అడిగి, అప్పుడు వార్త రాసే వారు. ఒక వేళ ఆ కధనం ప్రచురించినా, ఆయన అభిప్రాయం కూడా చివర్లో చెప్పి, ఆ కధనానికి ఒక లాజికల్ కంక్లుజన్ ఇచ్చే వారు. కాని, దాదపుగా ఒక పదేళ్ళ నుంచి, మొత్తం మీడియా స్వరూపమే మారిపోయింది. ఇష్టం వచ్చినట్టు కధనాలు వెయ్యటం, బురద చల్లటం, కడుక్కోండి అని కధనాలు వెయ్యటం. ఈ రకమైన ధోరణి, రాజకీయ పార్టీలకు, సొంత మీడియా రావటంతో మొదలైంది.
ఈ మధ్య కాలంలో, ప్రభుత్వాలకు దగ్గరగా ఉండే మీడియా ఛానెల్స్ కు కాంట్రాక్టు లు ఇచ్చి, వారిని మంచి చేసుకునే ధోరణి కూడా తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఇలాంటి వార్తలతో, అధికారాలు పోయిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. పింక్ డైమెండ్ అని, తిరుమల శ్రీవారి నగలు అని, శేఖర్ రెడ్డి అని, డేటా చోరీ అని, ఇలా అనేక ఆరోపణలు చేసినా, తెలుగుదేశం వాటిని తిప్పికోట్టలేక, ప్రజలు నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ఫేక్ ప్రచారం మానలేదు. సొంత ఛానెల్స్ లో కాని, తమకు ఫ్రెండ్లీగా ఉండే మీడియాలో కాని, వ్యతిరేక వార్తలు వేసి, ప్రత్యార్దిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, తాము వేసిన ఫేక్ కధనం, నిజం అని నమ్మించటానికి, ప్రముఖుల పేర్లు, ఆ కధనంలో వేస్తూ ఉంటారు.
ఇలాంటి కధనమే ఇప్పుడు ఒక పత్రికలో వచ్చింది. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ క్యారక్టర్ దెబ్బ తీస్తూ కధనం రాసి, లోకేష్ కు కన్సల్టంట్ గా, ప్రముఖ సినీ రచయత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ ను, నియమిస్తూ, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అంటూ, ఒక పత్రికలో కధనం వచ్చింది. దీని వెనుక ఉద్దేశం, లోకేష్ ని బద్నాం చెయ్యటం. అయితే, ఇక్కడ యండమూరి వీరేంద్రనాథ్ పేరు తీసుకోవటంతో, ఆయాన ఈ విషయం పై, సీరియస్ గా స్పందించారు. సోషల్ మీడియాలో ఈ వార్తా కధనం పై స్పందిస్తూ "దాదపు 15 సంవత్సరాల క్రితం బాలకృష్ణతో సినిమా చేసే రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఒకసారి (ఓన్లీ ఒన్స్) కలుసుకున్నాను. లోకేష్ నైతే నేను ఇంతవరకు చూడనే లేదు. ఇలాంటి వార్తల వల్ల ఈ పత్రికల వాళ్ళు ఏం సాధిస్తారో అర్ధం కాదు" అంటూ ఆయన కధనాన్ని ఖండిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.