ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు, ఈ రోజు కీలక కేసు విచారణకు వచ్చింది. మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాక్ డోర్ ఎంట్రీలను ఎట్టి పరిస్థతిలో కూడా తాము ఒప్పుకోమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా, వీటి అన్నిటినీ మించి ఏపి పోలీస్ ఆక్ట్ ఏదైతే ఉందో, ఆ యాక్ట్ కి కూడా ఇది విరుద్ధం అని స్పష్టం చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయో, ఇది రాజ్యాంగ విరుద్ధం అని, దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని, దీని పైన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు చెప్పిన సమయంలో, ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టుని అభ్యర్ధించారు. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు, తాము అడిషనల్ అఫిడవిట్ వేశామని, ఆ అఫిడవిట్ ని పరిశీలన చేయాలని కోర్టుని విజ్ఞప్తి చేసారు. ఆయన పదే పదే విజ్ఞప్తి చేయటంతో, హైకోర్టు ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ కేసులు అన్నీ కూడా రేపు మొత్తాన్ని కలిపి విచారణ చేస్తామని, ఎక్కువ సమయం దీనికి ఇవ్వబోమని, రేపు ఉదయమే, దీని పైన విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాధమిక సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయని, దీని పైన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు చెప్పిన తరుణంలో, అలా వద్దు అంటూ, తమ అఫిడవిట్ చూడాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేసిన తరుణంలో, కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
రేపు తుది విచారణ చేపడతామని, హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్ల తరుపున నర్రా శ్రీనివాస్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. తాము మొదటి నుంచి ఈ అంశం పై పోరాటం చేస్తున్నాం అని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసినా కూడా, ఆ ఉత్తర్వుల్లో కూడా కొత్త దనం లేదని, తాము మొదటి నుంచి చెప్తున్నట్టు, ఇది ఏపి పోలీస్ ఆక్ట్ కి విరుద్ధంగా ఉన్నాయని చెప్పమని, ప్రభుత్వం మాత్రం మళ్ళీ కొత్త ఉత్తర్వులు విడుదల చేసిందని, అందులో కూడా పాత ఉత్తర్వుల్లో ఉన్నదే ఉన్నదని, ఇందులో కొత్త దనం ఏమి లేదని, హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో హైకోర్టు ధర్మసానికి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, అదే విధంగా ఏపి పోలీస్ ఆక్ట్ కి కూడా ఇది విరుద్ధం అని, మహిళా రక్షణ కార్యదర్శులలు పోలీస్ డ్రెస్ ఎలా వేస్తారని, పోలీస్ డ్రెస్ వేయటం అంటే, పోలీస్ ఉద్యోగం చేసినట్టు అవుతుందని, పోలీస్ ఉద్యోగ నియామకాలు జరగాలి అంటే, పోలీస్ బోర్డు ద్వారానే చేయలని హైకోర్టు దృష్టికి ఈ అంశం తీసుకుని వచ్చారు. దీంతో వీరి వాదనతో ప్రభుత్వం ఏకీభవించింది.