2015 సమయంలో, ముద్రగడ పద్మనాభం, బాగా ఆక్టివ్ గా ఉండే వారు. ఆయన సహజంగా చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఆక్టివ్ గా ఉంటారనే పేరు ఉంది. గతంలో కూడా చంద్రబాబు సియంగా ఉంటే ఉద్యమం చేయటం, వైఎస్ఆర్ సియం అవ్వగానే లోపలకు వెళ్ళిపోవటం, మళ్ళీ చంద్రబాబు సియం అవ్వగానే బయటకు రావటం, ఇప్పుడు జగన్ సియం అవ్వగానే లోపలకు వెళ్ళిపోవటం చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వ హయాంలో, కాపు కార్పోరేషన్ పెట్టి రుణాలు ఇచ్చినా, కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా, కాపులకు ఎంతో న్యాయం చేసినా, చంద్రబాబు పైన ముద్రగడ ఒంటి కాలు మీద వెళ్ళే వారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, కాపు రిజర్వేషన్ ఎత్తేసినా, కాపు కార్పోరేషన్ మూలన పడేసినా, ఏమి చేయలేని పరిస్థితి. అయితే చంద్రబాబు హయాంలో, కాపు రిజర్వేషన్ కోసం అని, తునిలో మీటింగ్ పెట్టారు ముద్రగడ. ఆ మీటింగ్ లో కొంత మంది సంఘ విద్రోహ శక్తులు వచ్చి చేరాయి. ఏకంగా రత్నాచల్ ఎక్ష్ప్రెస్ తగలబెట్టారు. మొఖానికి మాస్కులు వేసుకుని, పెట్రోల్ డబ్బాలు తెచ్చి ట్రైన్ తగలబెట్టారు. ఇంతటి ఘోరం చేసిన వారి పైన, ఆ రోజు మీటింగ్ పెట్టిన నిర్వాహకుల పైన కేసులు పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా , ఇది చేసి తీరుతుంది. అది కనీస బాధ్యత.
అక్కడ రైల్వే కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భేషరతుగా ఆ కేసులు ఉపసంహరించుకుంది. అంటే, ఈ దేశంలో ఒక ట్రైన్ తగలబెట్టినా, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టినా, ఎవరి మీద చర్యలు ఉండవు, మీ వెనుక మేము ఉన్నాం అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. అయితే జగన్ మోహన్ రెడ్డి కేసులు ఉపసంహరణ పై ముద్రగడ పద్మనాభం ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఈ సంతోషంలో జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసారు. మంత్రి కన్నబాబు తనకు ఫోన్ చేసి, తమ పైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారని, చాలా సంతోషం అని అన్నారు. చేయని నేరానికి తమ పై కేసులు పెట్టారని, తమ జాతి తనను ఉద్యమం నుంచి తపించినా, భగవంతుడు మీ రూపంలో వచ్చి కేసులును తీసేయించటం సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ సందర్భంగా మిమ్మాల్ని స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పాలని ఉందని, అయితే మిమ్మల్ని కలిస్తే, డబ్బులు కోసం వెళ్ళాడు, పదవులు కోసం వెళ్ళాడు అని అంటారని, అందుకే కలవలేక పోతున్నా అని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసారు.