ఇప్పటికే AP ప్రభుత్వం పై ఉద్యోగులు అందరూ కూడా సమ్మె బాట పడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కలక్టరేట్ల ముట్టడికి ఈ రోజు పిలుపు నిచ్చిన నేపధ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్లు చేసారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు కలక్టరేట్ల ముట్టడికి ఈ రోజు అన్ని ఉద్యోఘ సంఘాలూ కూడా తమ మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనితో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు అందరిని కూడా ఎవరైతే కలక్టరేట్ల ముట్టడికి వస్తున్నారో వారందరిని కూడా ముందుగా అరెస్ట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడ తో వారు ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని జిల్లాల కలక్టరేట్ల వద్దకు ఈ ఉదయన్నే చేరుకుని, ఉద్యోగస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణిచి వేసినా గాని ఎట్టి పరిస్థితుల్లో తమ ఉద్యమం ఆగదని కూడా వారు తేల్చి చెబుతున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు నిన్నటి నుంచి కూడా పోలీసులు ఉద్యమ నాయకులని అరెస్ట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఏపి జేఎసి ,ఏపి జేఎసి అమరావతి సంఘాలు నేతలు రెవిన్యూ కావచ్చు, ఎపి NGO సంఘాలు కావచ్చు, ఇతర 9 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సమావేశం తరువాత సాయత్రం 7 గంటలకు ఒక మీడియా సమావేశం కూడా పెట్టి తమ యొక్క భవిషత్ కార్యాచరణ పై కూడా ఎనౌన్స్ చేస్తారని సమాచారం. మొత్తం మీద ఒక వైపు ఉపాధ్యాయ సంఘాలు, మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల కార్యక్రమాలను ప్రారంభించారు.
దీనికి సంభందించి జేఎసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విరమించుకుని సాయత్రం తమ భవిషత్ కార్యాచరణ అన్నినిటిని కూడా ప్రకటిస్తామంటున్నారు . మరోవైపు సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పటికే నిరసనలు తెలియజేస్తున్నారు. కొంతమంది నల్ల బాడ్జీలతో ఈ రోజు మధ్యాన్న భోజన నిరసన కార్యక్రమం కూడా తెలిపారు. మరోవైపు ఏపి NGOలు, ఏపి జేఎసి ,ఏపి జేఎసి అమరావతి నేతలు కూడా నల్ల బాడ్జీలు దరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే సాయత్రం జరిగే మీడియా సమావేశం తరువాతే ఒక క్లారిటీ రానుందని చెప్పొచ్చు. త్వరలోనే అన్ని సంఘల నేతలు కూడా సియస్ కు ఉద్యమానికి సంభందిచిన నోటీసులు ఇవ్వడంతో పాటు, అన్ని సంఘాలు ఒకే తాటి పైకి వచ్చి ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారని తెలుస్తుంది . అయితే ఇప్పటికే AP గవర్నమెంట్ అసోసియేషన్ సంభందించి సూర్యనారాయణ "సాధన సమితి" అనే ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తారని కూడా అయన చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉదోగులు కూడా సమ్మె బాట పడతామని చెప్పడంతో, ప్రభుత్వానికి అన్ని వైపులా నించి కూడా ఉక్కబోత మొదలైంది. ఈ సమ్మె విషయాన్ని మీడియా వాళ్ళు నిన్న జరిగిన మీటింగులో సియస్ ను అడగ్గా తనకు ఆ సమ్మె విషయం అసలు తెలియదని ,మీడియా వాళ్ళు చెబితేనే తెలిసిందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ప్రభుత్వానికి ఉద్యోగులతో చర్చలు జరిపే ఉద్దేశమే లేదని స్పష్టం అవుతుంది. ఇటు ఉద్యోఘ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం తో చర్చలకు విముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది.