ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెగాసిస్ సాఫ్త్వర్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల పైన చేస్తున్న పోరాటం ప్రజల్లోకి వెళ్ళటంతో, అది డైవెర్ట్ చేయటానికి, ప్రశాంత్ కిషోర్ తో కలిసి, వైసీపీ పెగాసిస్ అంశాన్ని తెర పైకి తెచ్చింది. చంద్రబాబు నాయుడు పెగాసిస్ వాడారు అంటూ, మమతా చెప్పింది అంటూ, కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అసలు మమతా చెప్పినట్టు ఎక్కడా రికార్డు అయితే లేద కానీ, కొన్ని అనుకూల పత్రికల్లో వార్తలు అయితే వచ్చాయి. దీంతో ఇది పట్టుకుని వైసీపీ రచ్చ రచ్చ చేసి, జంగారెడ్డి గూడెం మరణాలు పక్కదోవ పట్టించాలని ప్లాన్ చేసింది. అయితే అది వర్క్ అవుట్ కాలేదు. ఈ క్రమంలోనే, అప్పటి ఇంటలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వర రావు పైన కూడా, వైసీపీ నేతలు ఆరోపణలు చేసారు. దీంతో ఆయన మీడియా సమావేశం పెట్టి, అందరినీ కలిపి వాయించి పడేసి, మొత్తం విషయం పైన క్లారిటీ ఇచ్చారు. అలాగే తన పైన వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారి పైన ఫైర్ అయిన ఏబి వెంకటేశ్వర వారు, వారి పైన పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మళ్ళీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలతో, మళ్ళీ ఏబివీ లైన్ లోకి వచ్చారు.
నిన్న వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, పెగాసిస్ అంశం పైన ఏబి వెంకటేశ్వర రావు మాట్లాడుతున్న మాటలు విచిత్రంగా ఉన్నాయని, ఆయనది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదని, ఇజ్రాయిల్ పెగాసిస్ సర్విస్ అంటూ యద్దావా చేసారు. అంతే కాకుండా తమ ప్రభుత్వం కూడా నిఘా పరికరాలు వాడుతుందని, నిబంధనలకు లోబడి ఇది వాడుతున్నాం అని నోరు జారారు. తరువాత మళ్ళీ వచ్చి, తన మాటలు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల పైన ఏబి వెంకటేశ్వర రావు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు ఆధారాలు ఉంటే అవన్నీ ప్రభుత్వానికి ఇచ్చి, తన పై విచారణ చేయించుకోవచ్చాని అన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపణలకు ఆధారాలు ఏమి లేవని, చిన్న పిల్లలకు కూడా అర్ధం అవుతుందని అనంరు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల పై పరువు నష్టం దావా వేస్తున్నానని అన్నారు. ఇప్పటికే సాక్షి, అంబటి, విజయసాయి రెడ్డి పై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.